S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/25/2015 - 11:38

నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల వద్ద నాగార్జునసాగర్ కాలువలో బుధవారం ఉదయం కార్తీక స్నానాలు చేసేందుకు వెళ్లిన మహేష్ అనే యువకుడు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇదే సంఘటనలో సూర్యాపేటకు చెందిన ఓ యువకుడిని స్థానికులు రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన మహేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

11/25/2015 - 11:37

హైదరాబాద్: రాజేంద్ర నగర్ మండలం కోకాపేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ఓ కారు పాల వ్యాన్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకరిని మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడిగా గుర్తించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు రాములు భార్య పేరున రిజిష్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు.

11/24/2015 - 13:57

వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీకి 6,15,403 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ పార్టీకి 1,56, 315 ఓట్లు అదేవిధంగా బీజేపీకి 1,30,178 ఓట్లు పోలయ్యాయి. గతంలోని సీఎం కేసీఆర్, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డును పసునూరి బ్రేక్ చేశారు. టీఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చుకున్నారు.

11/24/2015 - 13:36

వరంగల్ : వరంగల్ ఉపఎన్నికల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాసా అభ్యర్థి భారీ ఆధిక్యంలో దూసుకువెళుతున్నారు. దాదాపు ఆయన 4లక్షల ఓట్లకు పైగా ఆధ్యక్యం సాధించారు. దీనిపై తెరాసా అభ్యర్థి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను ప్రజలు నమ్మారని, అందరి సహకారంతో ఈ విజయాన్ని సాధించామని అన్నారు.

11/24/2015 - 13:36

మహబూబ్‌నగర్ : జిల్లాలోని కోయిల్‌కొండ మండలం బూరుగుపల్లి సర్పంచ్ దేవమ్మ తన పొలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు.

11/24/2015 - 11:39

వరంగల్: వరంగల్ ఉపఎన్నికలో అధికార తెరాస పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బిజెపి అభ్యర్థి దేవయ్య ఆరోపించారు. ఉపఎన్నికలో తాము ఓటమి పాలయినప్పటికీ అసంతృప్తి లేదన్నారు. ఓటర్లను మభ్యపెట్టి, బెదిరించి తెరాస నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, కెసిఆర్ పాలనపై విద్యాధికుల్లో వ్యతిరేకత వ్యక్తమయిందని చెప్పారు.

11/24/2015 - 11:39

మెదక్: జీవనోపాధి కోసం మెదక్ జిల్లా మనూరు మండలం నుండి కర్నాటక రాష్ట్రానికి వెళ్తున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హుమ్నాబాద్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. వీరు వెళ్తున్న లారీని ఒక ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

11/24/2015 - 11:38

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉగ్రవాద చర్యలకు అవకాశం ఉన్నట్లు కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరించడంతో నగర పోలీసులు పాతబస్తీలో మంగళవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాబానగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

11/24/2015 - 11:37

హైదరాబాద్: పార్కింగ్‌కి సంబంధించి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు రైల్వే హోంగార్డులను మంగళవారం గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా వీరు పార్కింగ్ పేరిట దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

11/24/2015 - 11:36

వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి దయాకర్ భారీ ఆధిక్యత దిశగా దూసుకు పోతున్నారు. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమయినప్పటి నుంచి అధికార తెరాస పార్టీ విపక్షాలపై అన్ని రౌండ్లలోనూ ముందంజలో ఉంది. కాంగ్రెస్, బిజెపి, వామపక్షాల అభ్యర్థులతోపాటు మొత్తం 23 మంది ఉపఎన్నిక బరిలో నిలిచారు. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Pages