S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/21/2020 - 04:31

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణలో బహుళ గృహ, గేటేడ్ కమ్యూనిటీ, ప్రైవేట్ సంస్థల విద్యుత్ వినియోగదారులు ఇక నుంచి సొంతగా సంబంధిత గృహ అవసరాలకు ట్రాన్సి ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని దక్షిణ విద్యుత్ సరఫరా పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ట్రాన్ని ఫార్మర్లకు వినియోగిస్తున్న ముడిసరుకు చైనా నుంచి దిగుమతిలో ఇబ్బందులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

02/21/2020 - 04:29

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఈ నెల 24వ తేదీన సంఘసేవకురాలు జే ఈశ్వరీబాయి వర్థంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఈశ్వరీ భాయి మెమోరియల్ ట్రస్టు చైర్‌పర్సన్ డాక్టర్ జే గీతారెడ్డి తెలిపారు. 24వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్ చర్చి వద్ద ఈశ్వరీ భాయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో వర్థంతి సభ ఉంటుంది.

02/21/2020 - 01:31

హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పాలక వర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు స్టేట్ కో-ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 22న ఎన్నికల నిర్వహణకు నోటీస్ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి 10 జిల్లాల వారీగానే డీసీసీబీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు

02/21/2020 - 01:29

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు శాసనసభ సచివాలయం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగించాలి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలి? తదితర వాటికి తేదీలను సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి శుభ ముహుర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేశాక అందుకు అనుగుణంగా సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది.

02/21/2020 - 01:27

వేములవాడ, ఫిబ్రవరి 20: ప్రణాళికాబద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందాలని, పట్టణాల్లో అవినీతి లేకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పట్టణ ప్రణాళిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవినీతి రహితంగా పాలన ఉండేందుకే ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారన్నారు.

02/21/2020 - 01:35

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 15వ తేదీన హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం నాడు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఉన్న అన్ని అనుమానాలను అమిత్ షా నివృత్తి చేస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే ఎల్‌బీ స్టేడియం అధికారులతో కూడా సంప్రదించినట్టు ఆయన తెలిపారు.

02/20/2020 - 23:33

హైదరాబాద్, ఫిబ్రవరి 20: విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎట్టకేలకు వాస్తవాలను గ్రహించి, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం ద్వారా పొరపాట్లు సరిదిద్దుకునేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాది జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృత్తం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు సీనియర్ అధికారులు అంతా చాలా గట్టిగా చెప్పడంతో ఈ ఏడాది బోర్డు అధికారులు మరింత దృష్టి సారించి టెక్నాలజీని ఊతంగా తీసుకుంటున్నారు.

02/20/2020 - 23:32

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఐఐటీ హైదరాబాద్ ట్యాలెంట్ స్ప్రింట్ సహకారంతో కృత్రిమ మేథస్సుపై సర్ట్ఫికేట్ కోర్సును ప్రారంభించింది. ఆరు నెలల వ్యవధితో కూడిన ఈ కోర్సులో భాగంగా ఎఐ, ఐఓటీ, బ్లాక్ చెయిన్, క్వాంటం కంప్యూటింగ్, ఇతర అధునాతన టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తామని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి చెప్పారు.

02/20/2020 - 23:32

హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మరో రెండు దేవాలయాలకు రెనోవేషన్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రెండు ఆలయాలకు ఈ తరహా కమిటీలను నియమించిన ప్రభుత్వం గురువారం మరో రెండు ఆలయాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ జీఓలను జారీ చేసింది. రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్ పేరుతో రెండు వేర్వేరు జీఓలు జారీ అయ్యాయి.

02/20/2020 - 23:31

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆంధ్రాలో ప్రధాన కార్యాలయాలతో నడుస్తున్న అనేక కార్పొరేట్ కాలేజీలు తెలంగాణకు తరలివస్తున్నాయి. ఆంధ్రాలో కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడానికే పరిమితం కాకుండా తరచూ పర్యవేక్షణ చేయడంతో అక్కడి నిబంధనలను పాటించలేకపోతున్న కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల అనుబంధ హాస్టళ్లు తెలంగాణకు వస్తున్నాయి.

Pages