S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/17/2018 - 06:30

హైదరాబాద్, నవంబర్ 16: తాము అధికారంలోకి రాగానే ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విః హనుమంత రావు హామీ ఇచ్చారు. ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా హైకోర్టు ఇటీవల తాత్కాలికంగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం ధర్నా చౌక్ వద్ద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వీహెచ్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

11/17/2018 - 06:34

హైదరాబాద్: విద్యాసంస్థలు పన్ను అతిక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని హైదరాబాద్ ప్రాంత ఆదాయ పన్ను కమిషనర్ డాక్టర్ రాజేంద్రకుమార్ పేర్కొన్నారు. మూల ధనం వద్ద పన్ను మినహాయింపు నిబంధనలను అతిక్రమించినట్టయితే ఆదాయ పన్ను చట్టం 1961లోని 271 సీ, 272ఎ (2) సెక్షల ప్రకారం శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

11/17/2018 - 05:09

ఎన్నికల భూమి
===========

11/16/2018 - 13:40

ఖమ్మం: తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారంనాడిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అనటం సరికాదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి సాధనలో టీఆర్‌ఎస్ విఫలమైందని అన్నారు.

11/16/2018 - 13:39

హైదరాబాద్: ఎన్నికలలో డబ్బు పంపిణీని అరికడతామని, ఇప్పటివరకు రూ.85 కోట్లు సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్‌కుమార్ అన్నారు. ఆయన సుందరయ్య విజ్ఞాన్ భవన్‌లో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ 1950 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్ పేపరు వినియోగం జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేసినా ఓటరు ఆలోచించే ఓటు వేస్తారని అన్నారు.

11/16/2018 - 13:38

హైదరాబాద్: ధర్నాచౌక్‌లో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు శుక్రవారంనాడు నిరసన చేపట్టారు. రాఫెల్ విమానాల తయారీని ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. కేసీఆర్ శపథం పనికిమాలిందని అన్నారు.

11/16/2018 - 13:36

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు మండలాల విలీనంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో విలీనమైన మండలాల నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాతే ఎన్నికలు చేపట్టాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. అలాగే ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

11/16/2018 - 06:57

హైదరాబాద్, నవంబర్ 15: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి తన గురించి చెప్పాలని 70 రోజులు ఎదురుచూసినా ఫలితం లేకపోయిందని, అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పేర్కొన్నారు. రాజకీయంగా తనను సమాధి చేయడం కోసమే తనకు అపాయింట్ ఇవ్వలేదని ఆమె చెప్పారు.

11/16/2018 - 06:50

తుర్కపల్లి, నవంబర్ 15: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గం తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీత పనితీరును నిరసిస్తు తుర్కపల్లి జడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి అయోధ్యరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతు ఆలేరు నియోజకవర్గానికి పట్టిన శని గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలంటు ఆమె విమర్శించారు.

11/16/2018 - 06:47

హైదరాబాద్, నవంబర్ 15: టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ టీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టించింది. తాము టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్టు వచ్చిన వార్తలను చేవేళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి, మహబూబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ తీవ్రంగా ఖండించారు.

Pages