S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/16/2018 - 06:46

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసిన బీజేపీ గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో 20 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించింది.

11/16/2018 - 06:44

హైదరాబాద్, నవంబర్ 15: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఈఓ రజత్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారని, వీరిపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన సీఈఓ రజత్ కుమార్‌ను కలిసి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వినతిపత్రం ఇచ్చారు.

11/16/2018 - 06:43

హైదరాబాద్, నవంబర్ 15: అట్టడుగు వర్గాలను కేసీఆర్ మోసగించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి వ్యతిరేకి అన్నారు. దళితులు , బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా వ్యతిరేక దృష్టితో చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఫలితాన్ని రాబోయే ఎన్నికల్లో ఫలితాల్లో అనుభవిస్తారని చెప్పారు.

11/16/2018 - 06:43

ఖమ్మం, నవంబర్ 15: అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే అసంతృప్తి కూడా భారీ స్థాయిలో బయటపడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల్లో అసమ్మతులు బహిర్గతమయ్యాయి. మహకూటమిలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు సీట్లను ఆశించిన నేతలు తమకు టిక్కెట్ దక్కకపోవటంతో రెబల్‌గా నామినేషన్ వేస్తామని ప్రకటించారు.

11/16/2018 - 06:42

హైదరాబాద్ , నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉన్న దివ్యాంగుల సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేసిందని తెలంగాణ దివ్యాంగుల విభాగం కన్వీనర్ సీహెచ్ శ్రీశైలం ఆరోపించింది. దివ్యాంగులపై సవతితల్లి ప్రేమ తప్ప, నిజమైన ప్రేమ లేదని, కేవలం ఫించను ఇచ్చి హక్కులను ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కారని చెప్పారు.

11/16/2018 - 05:47

టేక్మాల్, నవంబర్ 15: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ప్రధాన సమస్య అయన గుండువాగు కాలువను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తెరాస ప్రభుత్వం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. గురువారం మండలం లోని కుసంగిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

11/16/2018 - 05:46

సూర్యాపేట, నవంబర్ 15: పేద ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ‘మేము సైతం మీతోనే’ నినాదంతో హమాలీ సంఘం ఆధ్వర్యలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వం కార్మిక సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఉందన్నారు.

11/16/2018 - 05:45

చందుర్తి, నవంబర్ 15: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎన్నో లేఖలు రాశారని, ఆ లేఖలను బహిర్గతం చేశానని, వాటిని వెనక్కి తీసుకొనే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు అన్నారు.

11/16/2018 - 05:44

కొత్తకోట, నవంబర్ 15: కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీమసీదును కూల్చి వేశారని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సాయంత్రం కొత్తకోట రోడ్డుషోలో ఆయనతో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఇంతియాజ్, ఇప్తార్ అహ్మద్ పాల్గొన్నారు.

11/16/2018 - 05:43

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ రాష్ట్ర పార్టీ నాయకత్వంపై చిందులు తొక్కారు.

Pages