S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/19/2016 - 16:38

హైదరాబాద్: దిల్లీలోని పటియాలా హౌస్ వద్ద ఇటీవల జరిగిన దాడులకు సంబంధించి హైదరాబాద్‌లోని హైకోర్టు బార్ కౌన్సిల్ వద్ద రెండు వర్గాల లాయర్లు శుక్రవారం ఘర్షణ పడ్డారు. దిల్లీ ఘటనను ఖండించిన ముగ్గురు లాయర్లను బిజెపి సానుభూతిపరులైన కొందరు లాయర్లు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని చక్కదిద్దారు.

02/19/2016 - 16:38

నల్గొండ: సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

02/19/2016 - 16:37

హైదరాబాద్: పోలీసు శాఖలో మరో 332 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసు శాఖలోని కమ్యూనికేషన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 25 నుంచి మార్చి 15 వరకూ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

02/19/2016 - 16:36

హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో ఇపుడున్న 119 నియోజకవర్గాలను 153కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

02/19/2016 - 13:00

సికిందరాబాద్: సికిందరాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. వైద్యసేవలు, పరిశుభ్రత, వైద్యుల పనితీరు వంటి విషయాలపై ఆయన రోగులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

02/19/2016 - 12:07

నల్గొండ: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పి.జి. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా చిలుకూరులో శుక్రవారం జరిగిది. ప్రియుడు మోసం చేసినందువల్లే విద్యార్థిని లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

02/19/2016 - 12:07

హైదరాబాద్: జెఎన్‌యు విద్యార్థి కన్నయ్యను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపు నివ్వడంతో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసరాల్లో ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు.

02/19/2016 - 12:03

హైదరాబాద్: సికిందరాబాద్ సమీపంలోని బోయిన్‌పల్లిలో చింతల నరసింహం అనే చేపల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి బండరాయితో తలపై మోది హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

02/19/2016 - 12:02

హైదరాబాద్: నగరంలోని ఎ.పి. సచివాలయంలోని ‘ఎల్’బ్లాక్ రెండో అంతస్థులో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్లే మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. వికలాంగ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.

02/19/2016 - 12:01

వరంగల్: సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి శుక్రవారం ఉదయం మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతికి మేడారం జాతర నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని బాలయ్య అన్నారు.

Pages