S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/13/2018 - 04:05

వరంగల్, నవంబర్ 12: వరంగల్ పశ్చిమ గెలిచే సత్తా కాంగ్రెస్‌కే ఉందని కార్యకర్తలు హన్మంతరావును నిలదీశారు. వరంగల్ నగరంలోని అతి కీలకమైన వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌ను మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ బలం ఎప్పుడో తుడుచు పెట్టుకుపోయందని..

11/13/2018 - 04:03

సిద్దిపేట, నవంబర్ 12: బంగారు తెలంగాణ అంటూ... ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. నాలుగేన్నర ఏళ్లకే పలాయనం ఎందుకు చిత్తగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌పై ఏంతో నమ్మకంతో ప్రజలు స్పష్టమైన మెజార్టీతో అధికారం కట్టబెడితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నాలుగున్నర ఏళ్లకే ముందస్తు ఎన్నికలకు తెరలేపిన కేసీఆర్...

11/13/2018 - 03:59

సిద్దిపేట, నవంబర్ 12 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ వందసీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని.. గులాబీ జెండా పేద ప్రజలకు అండ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో దళితుల ఆశీర్వాద సభ లో మంత్రి హరీష్‌రావు హాజరై మాట్లాడారు. కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం తీసుకొని మీ ఆశీర్వాదం తీసుకొని వచ్చినట్లు పేర్కొన్నారు.

11/13/2018 - 03:55

హైదరాబాద్, నవంబర్ 12: పోడు రైతులకూ రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పోడు భూముల సాగుదారులపై అటవీ అధికారులు, పోలీసులు జరుపుతున్న వేధింపులు, దాడులను వెంటనే నిలిపి వేయాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

11/13/2018 - 03:26

హైదరాబాద్, నవంబర్ 12: ముందస్తు ఎన్నికలకు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. అయినా తమకు సీటు రాదేమోనన్న అనుమానంతో 5 రోజులుగా కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్ ఆవరణలో, ప్రధాన గేటు వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వర్దన్నపేట ఆశావాహుడు కే.శ్రీ్ధర్ తన అనచరులతో గాంధీ భవన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్యారాషూట్‌తో ఆవరణలోకి దిగే వారికి టిక్కెట్లు ఇస్తున్నారని వారు విమర్శించారు.

11/13/2018 - 03:22

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 51 నెలల్లో ఖర్చు చేసిన 8 లక్షల కోట్ల రూపాయిలకు లెక్కలు చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన టీడీపీ కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, జాతీయ పార్టీ ప్రధానకార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి ఇతర సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

11/13/2018 - 03:20

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో సభ్యుల చరిత్రను విశే్లషించిన ఏడీఆర్, టీ- ఎలక్షన్ వాచ్ సంస్థలు దిగ్భ్రాంతికర అంశాలను వెల్లడించాయి. ఈ మేరకు ఈ సంస్థలు ఆరు పేజీల నివేదికను పత్రికలకు విడుదల చేశాయి. 119 ఎమ్మెల్యేల్లో రికార్డులు లభించక తొమ్మిది మంది వివరాలు వెల్లడించలేదు.

11/13/2018 - 03:19

హైదరాబాద్, నవంబర్ 12: దేశంలోని ముఖ్యమంత్రుల్లో ప్రజలకు దూరంగా ఉండేది తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఒక్కరేనని కాంగ్రెస్ నేత, పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి వ్యంగ్యోక్తులు చేశారు.

11/13/2018 - 03:18

హైదరాబాద్, నవంబర్ 12: యూకే సాంస్కృతిక సంబంధాలు, విద్యావకాశాలకు సంబంధించిన అంతర్జాతీయసంస్థ బ్రిటిష్‌కౌన్సిల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ - స్టెమ్‌లో భారతీయ మహిళలు మాస్టర్స్ డిగ్రీ కొనసాగించేందుకు 70వ వార్షిక ఉపకార వేతనాలను ప్రకటించింది. స్టెమ్ స్కాలర్‌షిప్‌లు పొందిన 104 మంది భారతీయ మహిళలకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే అభినందించారు.

11/13/2018 - 03:18

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే తొమ్మిది మంది బీజేపీ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

Pages