S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/13/2018 - 03:17

హైదరాబాద్, నవంబర్ 12: కాంగ్రెస్ పార్టీ గెలువని సీట్లనే తెలంగాణ జన సమితి (టీజేసీ)కి కేటాయించిందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నాలుగు సీట్ల కోసం గాంధీభవన్ చుట్టూ కోదండరామ్ పొర్లు దండాలు పెడితే ఓడిపోయే సీట్లను కట్టబెట్టిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం టీజేసీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నగేశ్ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

11/12/2018 - 16:50

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయకూడదో హరీశ్‌కు తాము వంద ప్రశ్నలు వేస్తామని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లేఖ వల్ల ఏ ప్రాజెక్టు ఆగిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. కనీస ఉమ్మడి ప్రణాళికను రేపు విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు.

11/12/2018 - 16:49

హైదరాబాద్: తొలిరోజే బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ముషీరాబాద్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని విజయగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హన్షరాజ్ తాహిర్, ఎంపీ దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోషామహల్ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు.

11/12/2018 - 12:25

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నోటిఫికేషన్‌కు గవర్నర్ నరసింహాన్ ఆమోదముద్ర వేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో ఈ రోజు సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఈనెల 19. పరిశీలన 20, ఉపసంహరణ 22తో ముగుస్తుంది.డిసెంబరు 7న ఎన్నికలు జరుగుతాయి. 11 ఫలితాలు విడుదల అవుతాయి.

11/12/2018 - 04:08

జగదేవ్‌పూర్, నవంబర్ 11: నిరాడంబరంగా ఈనెల 14న గజ్వేల్ నుండి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నామినేషన్ వేస్తున్న క్రమంలో నియోజకవర్గం నుంచి కార్యకర్తలు ఎవరూ రావద్దని..

11/12/2018 - 04:06

హైదరాబాద్, నవంబర్ 11: మైనార్టీ సబ్‌ప్లాన్ అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముస్లిం నేతలకు భరోసా ఇచ్చారు. ఆదివారం నాడు అబుల్ కలామ్ అజాద్ జయంతి వేడుకల సందర్భంగా టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కథ్రియ హోటల్ జరిగిన సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు.

11/12/2018 - 04:04

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ తీసుకున్న విసృత చర్యల నేపథ్యంలో బలగాలను సిద్ధం చేశారు. నేటి నుంచి డిశంబర్ 12వ తేదీ వరకు తెలంగాణలో పోలీస్ పహారా పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టబోతున్నారు. ఎలాంటి ఘటనలను సైతం ఎదుర్కోగలమని పోలీస్ అధికారులు భరోసా ఇస్తున్నారు.

11/12/2018 - 04:02

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో గుజరాత్ సమాజ్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం సంతోషకరమని, హర్షణీయమని టీఆర్‌ఎస్ నేత, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ నేతృత్వంలో గుజరాత్ సమాజ్ సభ్యులు భారీ ఏత్తున ఆదివారం కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

11/12/2018 - 03:57

హైదరాబాద్, నవంబర్ 11: ఆధునిక విజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వినియోగించకపోవడం వల్ల దొంగఓట్లు పోలయ్యేందుకు అవకాశం ఏర్పడటమే కాకుండా ఎన్నికల వ్యయం కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడ్డది. బయోమెట్రిక్ విధానాన్ని పోలింగ్‌లో అమలు చేయగలిగితే దొంగఓట్లు పోలయ్యే అవకాశం ఉండదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 12 కోట్ల రూపాయలు ఆదా చేసేందుకు వీలవుతుందని తెలుస్తోంది.

11/12/2018 - 03:41

మోర్తాడ్/వేల్పూర్, నవంబర్ 11: రాష్ట్రంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారని, దానివల్ల రానున్న రోజుల్లో మరింత మెరుగైన సంక్షేమం అందుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

Pages