S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/12/2018 - 03:39

కరీంనగర్, నవంబర్ 11: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అనీ.. మరోసారి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ఓట్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు యత్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

11/12/2018 - 03:37

మిర్యాలగూడ, నవంబర్ 11: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నది టిఆర్‌ఎస్ అని అందువలను ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళశాల క్రీడమైదానంలో క్రీడాకారులను, మార్నింగ్ వాకర్స్‌ను ఎమ్మెల్యే అభ్యర్ధి భాస్కర్‌రావు కలుసుకోని తనకు ఓటు వేయాలన్నారు.

11/12/2018 - 03:35

సిద్దిపేట, నవంబర్ 11 : తెలంగాణ సాహిత్య,సాంస్కృతిక రంగంలో అగ్రశ్రేణి చెందిన సాహితివేత్తల్లో ఒకరైన నందిని సిధారెడ్డి సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షుడు గంట జలంధర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన సాహితివేత్తల ఆత్మీయుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.

11/12/2018 - 03:32

నల్లగొండ రూరల్, నవంబర్ 11: గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో లేని అభివృద్ధి టీఆర్‌ఎస్ నాలుగున్నర ఏళ్లలో చేసిందని, కేసీఆర్ చల్లని పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో 26వ రోజు ఇంటింటికి ప్రచార పాదయాత్ర న్యూ వీటీ కాలనీ, శ్రీనగర్ కాలనీలలో కొనసాగించగా పెద్ద ఎత్తున స్థానికులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.

11/12/2018 - 02:58

గరిడేపల్లి, నవంబర్ 11 : వచ్చే ఎన్నికల్లో హుజూ ర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సూ ర్యాపేట జిల్లా జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోరారు. గరిడేపల్లిలో ఆదివారం ముఖ్య నాయకులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఒక్కో కార్యకర్త ఒక ఉత్తమ్‌లా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

11/12/2018 - 02:54

నల్లగొండ రూరల్. నవంబర్ 11: కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులంతా ఏకమై కంచర్ల భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అటవీ లభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్లతో కలిసీ పాల్గొన్నారు.

11/12/2018 - 02:09

చిత్రం..హరీష్‌రావుకు బీఫాం అందజేస్తున్న కేసీఆర్

11/11/2018 - 04:22

సంగారెడ్డి, నవంబర్ 10: అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. శనివారం రాత్రి సంగారెడ్డిలో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అన్ని వర్గాల వారి అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడిందన్నారు.

11/11/2018 - 04:20

చొప్పదండి, నవంబర్ 10: సిబ్బందిని తోబుట్టువుల్లాగా చూడాల్సిన అధికారి, సభ్యసమాజాన్ని మరిచి మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన సంఘన కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో జరిగింది. వివరాల్లోకి వెలితే గత నెల 25న చొప్పదండి మున్సిపాలిటీ కమిషనర్‌గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ నిత్యానంద్ అదే రోజు నుంచి సిబ్బందిని గమనించిన కమిషనర్‌కు దర్బుద్ది కలిగినట్లుంది.

11/11/2018 - 04:16

నిజామాబాద్, నవంబర్ 10: నిజమైన సెక్యులర్ పార్టీగా అందరి మన్ననలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీతో దోస్తీ చేసే అవసరం ఎంతమాత్రం లేదని, ఇకముందు కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ కరాఖండీగా తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ముస్లిం మైనార్టీలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.

Pages