S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/11/2018 - 04:15

గజ్వేల్, నవంబర్ 10: కరెంటు అడిగిన పాపానికి పిట్టల్లా కాల్చి చంపిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓట్లు అడుగుతారని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం గజ్వేల్ లోని రిటైర్డ్ ఉద్యోగులు, మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాదసభకు హాజరై ఆయన ప్రసంగించారు.

11/11/2018 - 04:13

మహబూబ్‌నగర్, నవంబర్ 10: యువత స్వయంశక్తిగా ఎదగాలని అలా ఎదిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మాజీ ఐపిఎస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా ధర్మపూర్ గ్రామంలో గల జయప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

11/11/2018 - 04:10

సూర్యాపేట, నవంబర్ 10: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీనే ఆదరిస్తున్నారని, సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్షగా భావిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన యువజన నాయకుడు బీరవోలు శ్రీహర్ష భారీ సంఖ్యలో తన అనుచరులతో శనివారం మంత్రి సమక్షంలో టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

11/11/2018 - 03:20

హైదరాబాద్, నవంబర్ 10: టిక్కెట్టు దక్కదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రోజూ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఆందోళనలకు దిగుతున్నారు.

11/11/2018 - 03:17

హైదరాబాద్, నవంబర్ 10: అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టిక్కెట్లు ఇవ్వకపోతే ఆయా రాజకీయ పార్టీలను ఓడించడానికి వెనుకాడబోమని బీసీ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ప్రకటించారు. దీని కోసం బీసీలు ఐక్యం కావాలని శనివారం ఇక్కడ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాలన్నారు. శనివారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల సమావేశం జరిగింది.

11/11/2018 - 03:16

హైదరాబాద్, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కే హరిబాబు ఆదివారం నాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. అనంతరం ఆయన నియోజకవర్గం సదస్సులో కూడా పాల్గొంటారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీ సదస్సులను బీజేపీ దశల వారీ పూర్తి చేస్తోంది. మరో పక్క తాండూరులో జరిగే నియోజకవర్గ సదస్సుకు పరిపూర్ణానంద స్వామి హాజరవుతారు.

11/11/2018 - 03:16

హైదరాబాద్, నవంబర్ 10: సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని టీ.పీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి, పార్టీ మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్‌కు 49 శాతం ఓట్లు వస్తాయని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తాజాగా సి-ఓటరు సర్వే కూడా అదే విషయాన్ని పేర్కొన్నదని గూడురు శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. టీఆర్‌ఎస్ గెలుస్తుందని ఇండియా టు-డే చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు.

11/11/2018 - 03:15

హైదరాబాద్, నవంబర్ 10: ‘నకిరేకల్ సీటు ఇవ్వడం కష్టమా?, అయితే ఇంకా ఎక్కడైనా సీటు కేటాయించండి..’ అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.

11/11/2018 - 03:14

హైదరాబాద్, నవంబర్ 10: అర్హతలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ఆధారంగా ఎంపికైనప్పటికీ విద్యా వలంటీర్లు శ్రమదోపిడీకి గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావలంటీర్లను ఉపాధ్యాయులతో సమానమైన గుర్తింపునిచ్చి పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

11/11/2018 - 03:11

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా జంటనగరాల్లో నామినేషన్లు దాఖలు చేసే నోడల్ కేంద్రాల వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.

Pages