S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2018 - 05:05

వరంగల్, నవంబర్ 5: కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు వస్తున్నది మహాకూటమి కాదని.. అది ప్రజా కూటమి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా కూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌కు ముచ్చెముటలు పడుతున్నాయని అన్నారు.

11/06/2018 - 05:02

మిర్యాలగూడ, నవంబర్ 5: రాష్ట్రంలో రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. తిరిగి సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

11/06/2018 - 05:00

వరంగల్, నవంబర్ 5: వరంగల్ తూర్పు నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఉత్కంఠానికి తెరపడనుంది. మాజీ ఎంపి , రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గుండు సుధారాణికే వరంగల్ తూర్పు టికెట్ ఖరారు కానుంది. టీఆర్‌ఎస్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాలో వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె అదిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసి కాంగ్రెస్ తీర్ధం తీసుకుంది.

11/06/2018 - 04:58

నర్సాపూర్,నవంబర్ 5: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

11/06/2018 - 04:56

సూర్యాపేట, నవంబర్ 5: నేడు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని అంథకారం చేసి తద్వారా సాధించుకున్న రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, గతంలో బాబు కుట్రలు ఛేదించి సీఎం కేసీఆర్ కఠోర శ్రమతో ఇంతటి గొప్ప విజయం సాధించారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

11/06/2018 - 02:50

హైదరాబాద్, నవంబర్ 5: దీపావళి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 4, 258 దుకాణాలకు లైసెన్సు మంజూరు చేసినట్టు రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గోపీకృష్ణ వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1436, హైదరాబాద్‌లో 946 దుకాణాలకు లైసెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. కరీంనగర్ 258, ఖమ్మం 339, వరంగల్ 371, మహాబుబ్‌నగర్ 90, నిజామాబాద్ 189, మెదక్ 180, నల్గొండ 144 దుకాణాలకు లైసెన్స్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

11/06/2018 - 02:48

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో అమిత్ షా వ్యూహం, పార్టీ ప్రధానకార్యదర్శులు రామ్ మాధవ్, పి మురళీధరరావుల ప్రత్యక్ష పర్యవేక్షణతో బీజేపీ నేతలు జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తొలి నుండి బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని, ఈ ఫలితాలు అనూహ్యంగా ఉండబోతున్నాయని చెబుతోంది. అంతే కాదు, రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చినా, తాము కీలక పాత్ర పోషించనున్నామని కూడా పేర్కొంటోంది.

11/06/2018 - 02:44

హైదరాబాద్, నవంబర్ 5: టీఆర్‌ఎస్ పెద్దలు చెప్పే అబద్దాలకు విసిగు చెందిన తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించే పనిలో ఉన్నారని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి పేర్కొన్నారు. గత వారం రోజులుగా కేటీఆర్ మాట్లాడుతున్న తీరును చూస్తే తెలంగాణ ప్రజలను మరో సారి మోసం చేయాలని చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఏరోటికాడ ఆ పాట అన్నట్టు కేటీఆర్ మాటలు ఉన్నాయని అన్నారు.

11/06/2018 - 02:43

హైదరాబాద్, నవంబర్ 5: మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీడీపీ నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇరువురు వెంటనే క్షమాపన చెప్పాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యల వెనుక టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి హస్తం ఉందని టీఆర్‌ఎస్ ఆరోపించింది.

11/06/2018 - 05:16

గజ్వేల్: రాజకీయ లబ్ధి కోసం పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే నాలుక చీరేస్తామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొల్గూరులో మాజీ ఎంపీపీ మల్లం రాజు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా ఏర్పాటుచేసిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

Pages