S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/04/2018 - 04:59

హైదరాబాద్, అక్టోబర్ 3: నాణ్యమైన విద్యుత్‌పై దృష్టి పెట్టాలే తప్ప ఉచిత విద్యుత్‌పై కాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛమైన తక్కువ వ్యయంలో ఉండే విద్యుత్ అవసరమని చెప్పారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తి దేశాన్ని పరిశుభ్రంగా మారుస్తోందని అన్నారు. నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్‌ను ప్రజలు కోరుకుంటున్నారని, ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఆయన తెలిపారు.

10/04/2018 - 04:57

హైదరాబాద్, అక్టోబర్ 3: ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారంతో వాస్తవాలకు అతీతంగా వార్తలు రాసినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నియమావళిపై మీడియా ప్రతినిధులకు, రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా సర్ట్ఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఒకరోజు వర్క్‌షాప్ బుధవారం ఇక్కడ నిర్వహించారు.

10/04/2018 - 04:55

హైదరాబాద్, అక్టోబర్ 3: దశాబ్ద కాలం అన్ని పదవులను సమర్ధవంతగా నిర్వహించిన వ్యక్తి సీఎల్‌పీ మాజీ నాయకుడు కుందూరు జానారెడ్డి అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జానారెడ్డి జీవిత చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ టీ.సురేందర్ ‘అజాత శత్రువు’ అనే పేరుతో రచించిన పుస్తకాన్ని ఉత్తమ్ ఆవిష్కరించారు.

10/04/2018 - 04:53

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణలో అన్న క్యాంటీన్లు ప్రారంభించే యోచన ఉందని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో పోలిట్‌బ్యూరో సభ్యులు టీ దేవేందర్ గౌడ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ మూడో సమావేశం జరిగింది.

10/04/2018 - 04:51

హైదరాబాద్, అక్టోబర్ 3: సెల్ టవర్ల నిర్మాణం వల్ల ఎలాంటి రేడియేషన్ ప్రభావం ఉండదని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి టెలికమ్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం సీఎస్ అధ్యక్షతన రాష్టస్థ్రాయి టెలికమ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది.

10/04/2018 - 04:49

హైదరాబాద్, అక్టోబర్ 3: ముందస్తు ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధమైన బీజేపీ ప్రచారంలో భాగంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సమ్మేళనాలు నిర్వహించనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువ ఓటర్లతో సమ్మేళనాలు, ఓబీసీ సదస్సులు నిర్వహించనుంది. 40 అసెంబ్లీ స్థానాల్లో భారీ ఎత్తున ఈ సమ్మేళనాలు నిర్వహిస్తారు. మరో 31 చోట్ల యువ సమ్మేళనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

10/04/2018 - 04:48

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరే వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పేర్కొన్నారు. ఉపాధి కలిగేలా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

10/04/2018 - 04:28

హైదరాబాద్, అక్టోబర్ 3: అధికారం చేపట్టిన తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి నేతలు హామీ ఇచ్చారు.

10/04/2018 - 04:27

హైదరాబాద్, అక్టోబర్ 3: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాంధీ భవన్‌కు చేరుకున్న ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులకు పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వాగతం పలికారు.

10/04/2018 - 04:24

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 24 నుండి నవంబర్ 10 తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర శర్మ తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.30 వరకూ, టెన్త్ పరీక్షలు ఉదయం ఉదయం 9.30 నుండి 12.30 వరకూ జరుగుతాయని అన్నారు. పరీక్షలు 24,25,26,27,29,30,31 తేదీల్లో జరుగుతాయి.

Pages