S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/03/2018 - 05:57

హైదరాబాద్, అక్టోబర్ 2: ‘నోటా’ చిత్రాన్ని వెంటనే నిలిపి వేయాలని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ‘నోటా’ చిత్రం ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉందని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇది యువతపై ప్రభావం చూపుతుందని తాను భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల నియామవళికి విరుద్ధం అని ఆయన చెప్పారు.

10/03/2018 - 05:56

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్ర శాసనసభకు జరగాల్సిన ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. పోలింగ్‌కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) లను ఓటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రేయిల్ (వీవీ ప్యాట్) లను వాడుతున్నందు వల్ల వీటిని ఏ విధంగా ఉపయోగించాలన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించారు.

10/03/2018 - 05:56

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్రంలో కంటి ఆపరేషన్లు వికటించినా ప్రభుత్వానికి పట్టింపు లేదని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి విమర్శించారు. సీఎం మాత్రం తన కంటికి ఢిల్లీలో ఆపరేషన్ చేయించుకుంటారని, తెంలగాణ ప్రజలకేమో నాసిరకం ఆపరేషన్లు చేయించారని ఆమె విమర్శించారు.

10/03/2018 - 05:55

హైదరాబాద్, అక్టోబర్ 2: అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపేలా పరిపాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని అపద్ధర్మ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. సామాజిక మాధ్యామాల వేదికగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలకు దిగుతున్నాయన్నారు.

10/03/2018 - 02:45

హైదరాబాద్/నార్సింగి, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేర్చినపుడే అసలైన నివాళి అర్పించినట్టవుతుందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ , ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, మంత్రు లు, గాంధేయవాదులు, నాయకులు గాంధీజీ సమాధికి ఘనంగా నివాళి అర్పించారు.

10/03/2018 - 02:39

హైదరాబాద్, అక్టోబర్ 2: ఓటర్ల నమోదుకు ఇంకా గడువు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి (సీఇవో) రజత్ కుమార్‌ను కోరారు. మంగళవారం మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఇవో రజత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తగినంత సమయం ఇవ్వకపోవడంతో కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోలేదని అన్నారు.

10/03/2018 - 02:39

హైదరాబాద్ అక్టోబర్ 2: వర్షాలతో అవాంతరాలు వచ్చినప్పటికీ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగిందని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సెప్టెంబర్ నెలాఖరుకి బొగ్గు ఉత్పత్తి 12.7 శాతంతో గణనీయంగా పెరిగిందని సంస్థ పేర్కొంది.

10/03/2018 - 02:37

హైదరాబాద్, అక్టోబర్ 2: టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్‌రెడ్డి దూకుడుపై పార్టీలోని కొంత మంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుపై, ఆపద్ధర్మ మంత్రి కే.

10/03/2018 - 02:36

హైదరాబాద్, అక్టోబర్ 2: దేశంలో ప్రసిద్ధి చెందిన వృత్తి సాంకేతిక విద్యాసంస్థల్లో యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థులు తమకు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ఆర్ధిక అభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి కృషి చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 65 గ్రామాలు ఎంపికయ్యాయి.

10/03/2018 - 02:35

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి తెలంగాణ ప్రజలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించలేకపోయిన ప్రభుత్వం, అదే సమయంలో శాసనసభకు తొమ్మిది నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ రెండింటి విషయాల్లో అయోమయానికి గురైన ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.

Pages