S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/05/2018 - 04:33

హైదరాబాద్, సెప్టెంబర్ 4: టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నీ అబద్దాలే చెప్పారని, రాష్ట్రంలో నారుూ బ్రాహ్మణులకు చేయని సహాయాన్ని చేసినట్లుగా చెప్పుకున్నారని టీ.పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.

09/05/2018 - 04:33

సిద్దిపేట, సెప్టెంబర్ 4: పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, నీరు, రైల్వేలైన్, మంచి రహదారులు అవసరమని సీఎం కేసీఆర్ కృషితోనే సిద్దిపేట జిల్లాలో అన్ని వసతులు సమకూర్చుకున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

09/05/2018 - 04:30

మహబూబ్‌నగర్, సెస్టెంబర్ 4: పాలమూరు నుండే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుందని దాంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను తప్పకుండా శాసించి తీరుతామని అందుకుగాను తమ ఎన్నికల ప్రణాళికలు తమకు ఉన్నాయని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12, లేదా 15న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు.

09/05/2018 - 04:28

కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 4: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూర్ గ్రామానికి తీరని అన్యాయం చేసే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మా ఊరికి రావద్దంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తమ ఊరికి తీరని అన్యాయం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.

09/05/2018 - 04:26

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 4: భారతదేశ రక్షణ ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉల్లంఘించారని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి నాసర్‌హుస్సేన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ పర్యటనకు విచ్చేశారు.

09/05/2018 - 04:24

జగిత్యాల, సెప్టెంబర్ 4: వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ యాంత్రీకరణతో లాభసాటిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

09/05/2018 - 04:21

కామారెడ్డి, సెప్టెంబర్ 4: దివ్యాంగుల సంక్షేమ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారికత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో దివ్యాంగులకు సహాయ పరికరాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

09/05/2018 - 02:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తెలంగాణలో శాసనసభకు ఎన్నికల ఎప్పుడు జరిగిన తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావువెల్లడించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలోముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని అన్నారు. గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేశామన్నారు.

09/05/2018 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 4: డి.శ్రీనివాస్‌కు సిగ్గుంటే రాజ్యసభ పదవికి, టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ డిమాండ్ చేసారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే చేయండి, రాజీనామా మాత్రం చేయననీ డీఎస్ నిస్సిగ్గుగా చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బాజిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

09/05/2018 - 02:03

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రభుత్వంలోని ఏ విభాగంలో పనిచేసిన వారైనా ఒక హోదాలో ఉద్యోగంలో చేరారంటే చాలు పదవీ విరమణ చేసే సమయానికి కనీసం రెండు నుండి నాలుగు పదోన్నతులు పొందుతుండగా, టీచర్లు మాత్రం టీచర్‌గా చేరి, టీచర్‌గానే రిటైర్ అవుతున్నారు. సర్వీసు రూల్స్ లేక, సక్రమంగా పదోన్నతులు లభించక, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక, ఎంత చెప్పినా ఫలితాలను సాధించలేక ఉపాధ్యాయులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

Pages