S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/01/2018 - 06:50

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్రంలో 2018 వానాకాలం పంటల విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరింది. వర్షాలు బాగా ఉంటే వానాకాలంలో 108 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 100 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇటీవల వర్షాలు బాగా కురవడంతో పంటల విస్తీర్ణం గత పదిహేను రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. శ్రీశైలం జలాశయం నిండిపోవడంతో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.

08/31/2018 - 23:01

వరంగల్, ఆగస్టు 31: ప్రగతి నివేదక సభకు పోటీగా కాంగ్రెస్ పార్టీ సభ పెట్టాలని చూస్తే నవ్వుల పాలు కాకతప్పదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల నుంచి 25 లక్షల మందితో నిర్వహించే ప్రగతి నివేదన సభ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. జాతీయ పార్టీలు కూడా ఇంతవరకు ఈ స్ధాయిలో దేశంలో ఇలాంటి సభ నిర్వహించలేదన్నారు.

08/31/2018 - 23:00

సదాశివపేట, ఆగస్టు 31: అతివేగం నలుగురిని పొట్టనబెట్టుకుంది. శుభకార్యాన్ని ముగించుకొని ఆనందంగా ఇంటికెళ్తున్న ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితులు, ఇన్‌స్పెక్టర్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం..

08/31/2018 - 22:55

నల్లగొండ, ఆగస్టు 31: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం శుక్రవారం రాత్రి కల్లా 583 అడుగులు, 294 టీఎంసీలకు చేరింది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312 టీఎంసీలు. నేడు జలాశయం నీటి మట్టం 585 అడుగులకు చేరుకోనుండడంతో సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తామని డ్యాం చీఫ్ ఇంజినీర్ సునీల్ వెల్లడించారు.

08/31/2018 - 22:52

నల్లగొండ, ఆగస్టు 31: కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే తాము ప్రజల చుట్టూ తిరుగుతున్నామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.

08/31/2018 - 22:51

నిజామాబాద్, ఆగస్టు 31: లైంగిక వేధింపుల ఆరోపణలపై 20రోజులుగా సారంగపూర్‌లోని జిల్లా జైలులో గడిపిన నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శుక్రవారం ఉదయం జైలు నుండి విడుదలయ్యారు. ఈనెల 12వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.

08/31/2018 - 22:49

గద్వాల, ఆగస్టు 31: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి వస్తున్న వరద నీటిని అంతే స్థాయిలో దిగువకు వదులుతుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.460 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుండి 1,64,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

08/31/2018 - 06:14

* రూ. 15వేల లంచం డిమాండ్ * పక్కా ప్రణాళికతో పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

08/31/2018 - 06:13

చౌటుప్పల్, ఆగస్టు 30: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామం స్టేజీ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలలోకి వెళ్తే.. నార్కట్‌పల్లి డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తోంది.

08/31/2018 - 06:11

జహీరాబాద్, ఆగస్టు 30: మరో పదేళ్లు అధికారంలో మేమే ఉంటామని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ.హరీష్‌రావు అన్నారు. గురువారం నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, జహీరాబాద్, న్యాల్‌కల్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.

Pages