S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/21/2015 - 13:42

వరంగల్‌ : తొర్రూరు మండలం పిక్యాతండాకు చెందిన ఓటర్లు వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ను బహిష్కరించారు. తండాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసిస్తూ తండా వాసులు పోలింగ్‌లో పాల్గొన లేదు. ప్రభుత్వాలు తమ గ్రామాన్ని అభివృద్ధిచేయటం లేదని, అందుకే పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తండా వాసులు పేర్కొన్నారు.

11/21/2015 - 13:35

వరంగల్‌: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వడ్డేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ దంపతులు కొడకండ్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.పర్వతగిరిలోని పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

11/21/2015 - 06:21

హైదరాబాద్, నవంబర్ 20: ఉబర్ క్యాబ్ సంస్థలో పని చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ మహ్మద్ జహీరుద్దీన్ ఆత్మహత్య కేసులో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. ఉమర్ క్యాబ్ సంస్థ జహీరుద్దీన్ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని వారు మంత్రుల దృష్టికి తెచ్చారు.

11/21/2015 - 06:20

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టనున్న 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 3344 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తీసుకోనున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్టు గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

11/21/2015 - 06:19

హైదరాబాద్, నవంబర్ 20: రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు 50శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత దృష్ట్యా రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

11/21/2015 - 06:18

హైదరాబాద్, నవంబర్ 20: నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మరో 11వందల ఇళ్లు అదనంగా కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. జగిత్యాల నియోజకవర్గంలో త్వరలోనే పర్యటించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నిజామాబాద్ ఎంపి కవిత, నిజామాబాద్ ఎమ్మెల్యే బి గణేష్ గుప్తా, జగిత్యాల టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్ సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను శుక్రవారం కలిశారు.

11/21/2015 - 06:02

వరంగల్, నవంబర్ 20: వరంగల్ ఉప ఎన్నికలో గెలుపోటములపై ఎవరి ధీమాలో వారున్నారు. పార్లమెంటు ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. వీరితో పాటు వైఎస్సార్‌సిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ కూడా ఎన్నికల ప్రచారాన్ని దీటుగానే కొనసాగించారు.

11/21/2015 - 06:02

వరంగల్, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న (నేడు) జరిగే పోలింగ్ కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో జరిగే పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం 20 కంపెనీల భద్రతా దళాలు మోహరించారు.

11/21/2015 - 06:00

సిద్దిపేట, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తుందని, రద్దు బదిలీ పథకం, సాదాబైనామాలపై పట్టా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ భవన్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేశారు.

11/21/2015 - 06:00

నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం, పత్తి దిగుబడుల అమ్మకాల్లో రైతన్నల కష్టాలు కొనసాగుతున్నాయి. కరవుతో దెబ్బతిన్న పంటల నుండి దక్కిన అరకొర దిగుబడులను వ్యయప్రయాసల మధ్య కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తే సకాలంలో డబ్బులు అందక రైతన్నలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.

Pages