S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/27/2018 - 04:09

సిద్దిపేట, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లాలో 500 ఎకరాల్లో పారిశ్రామిక కారీడార్ ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సెప్టెంబర్ 4న మలేసీయ కంపెనీకి కేటాయించిన భూమిలో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

08/27/2018 - 04:08

పాపన్నపేట, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, ఘణపురం ఆనకట్టలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు.

08/27/2018 - 04:06

నారాయణఖేడ్ ఆగస్టు 26 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 12 సంవత్సరాలు పోరాటం చేసి చివరకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ సాధించే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ముందుకు సాగుతున్నారని ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

08/27/2018 - 04:03

సిద్దిపేట, ఆగస్టు 26 : రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వచ్చే వానాకాలం నాటికి రంగనాయక్‌సాగర్‌ను నిండుకుండలా నింపి ప్రాజెక్టులు చేపలు పట్టుకునే హక్కు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

08/27/2018 - 03:10

హైదరాబాద్, ఆగస్టు 26: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌కు కవిత హెల్మెట్‌ను బహుకరించారు. రక్షా బంధన్ స్ఫూర్తితో సోదరుల ప్రాణాల రక్షణకు ప్రతి సోదరి హెల్మెట్ సమర్పించాలని కవిత పిలుపునిచ్చారు.

08/27/2018 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 26: ప్రజలు కనిపించే దేవుడిగా డాక్టర్లను భావిస్తారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రోగికి వ్యాధి నయమైతేనే డాక్టర్‌కూ ఆనందం కలుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ‘నాతన్స్ లర్నింగ్ ఫోరం’ (ఎన్‌ఎల్‌ఎఫ్) నాయకత్వ అవార్డుల-2018 ఉత్సవంలో మంత్రి నాయిని పాల్గొన్నారు.

08/27/2018 - 02:56

హైదరాబాద్, ఆగస్టు 26: కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ ఇంజనీరింగ్ అద్భుతం కాదని, అదో భారీ ఇంజనీరింగ్ తప్పిదమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజెఎసి) నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.

08/27/2018 - 02:54

హైదరాబాద్, ఆగస్టు 26: రోజురోజుకి రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని సామాజిక దృష్టితో చూడాలని, అలాగే ప్రజారోగ్య సమస్యగా గుర్తించినప్పడే ప్రమాదాలను నివారించవచ్చునని తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతి రోజూ రహదార్లపై వెళుతున్నప్పుడు కళ్ళ ముందు జరిగే ప్రమాదాలను చూచిచూడనట్లుగా వెళ్ళకుండా జరిగిన ప్రమాద సంఘటనపై సమీపంలో ఉన్న ఆసుపత్రులకు సమాచారం అందివ్వ

08/27/2018 - 02:51

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోస్టులకు రాతపరీక్షలు ఆదివారం జరిగాయి. వీటికి సంబంధించిన రాతపరీక్షల ‘కీ’ని సోమవారం విడుదల చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి, పోలీస్ శాఖ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జరిగిన పరీక్షల్లో దాదాపు1217 మంది ఎస్‌ఐలను భర్తీ చేయబోతున్నారు. పరీక్షలకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

08/27/2018 - 02:50

హైదరాబాద్, ఆగస్టు 26: ప్రభుత్వం ఫీజుల రీయంబర్స్‌మెంట్ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 30 తేదీన బిసి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేస్తున్నారు అంటూ అన్ని జిల్లా కలెక్టర్, ఆర్‌డిఓ కార్యాలయాలను ముట్టడించడానికి బిసి సంఘాలు సమాయత్తం అవుతున్నాయి.

Pages