S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/27/2018 - 02:50

హైదరాబాద్, ఆగసు 26: పాతనగరంలోని మెట్రో రైలు నిర్మాణం చేపట్టడంలో జరుగుతున్న జాప్యానికి మజ్లీస్ పార్టీదే బాధ్యత అని పీసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ విమర్శించారు.

08/27/2018 - 02:49

హైదరాబాద్, ఆగస్టు 26: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ. జీవన్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలను ఆమోదింపచేసుకోవడానికే కేసీఆర్ జోనల్ విధానాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు.

08/27/2018 - 02:49

హైదరాబాద్, ఆగస్టు 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్య రెడ్డి ఆదివారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇదంతా తండ్రి-తనయులు వ్యూహం ప్రకారమే చేశారని పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేయనున్నారు.

08/27/2018 - 02:48

హైదరాబాద్, ఆగస్టు 26: రాఖీ పౌర్ణమి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద నేతృత్వంలో పలువురు మహిళా నేతలు ఉత్తమ్ నివాసానికి వెళ్ళి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఉత్తమ్ వారికి కృతజ్ఞతలు చెప్పారు.

08/26/2018 - 04:24

గద్వాల, ఆగస్టు 25: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. శనివారం నాటికి జూరాల జలాయశంలో 318.290 మీటర్ల స్థాయిలో నీరు నిల్వఉండగా ఎగువ ప్రాంతం నుంచి 96 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

08/26/2018 - 04:21

కరీంనగర్, ఆగస్టు 25: హైదరాబాద్‌లో 25లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. జన ప్రవాహంతో కూడిన ఈసభ చారిత్రాత్మకం కానుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అంశాలను 99.9శాతం అమలు చేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 37 కులాల వారికి 10ఎకరాల్లో రూ.10కోట్లతో ఆత్మగౌరవ కేంద్రాలను హైదరాబాద్ నగరంలో నిర్మిస్తుమని అన్నారు.

08/26/2018 - 04:19

మహబూబాబాద్, ఆగస్టు 25: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తెలంగాణ ప్రజల హక్కు అని, పరిశ్రమ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలతోప్రభుత్వాల కళ్లు తెరిపిస్తామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధక్షుడ ఎల్.రమణ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం బయ్యారం ఉక్కుపరిశ్రమ సాధన కోసం నిరసన సభను నిర్వహించారు.

08/26/2018 - 04:17

శ్రీశైలం ప్రాజక్టు, ఆగస్టు 25: ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానకి వస్తున్న వరద నీటి ప్రవాహ ఉద్ధృతి తగ్గడంతో శనివారం రెండు గేట్లను మాత్రమే పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల వరదగేట్ల నుంచి 58.363 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40వేల క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 19,770 క్యూసెక్కులు మొత్తం 1,20,133 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుంది.

08/26/2018 - 04:15

నిజామాబాద్, ఆగస్టు 25: నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న అధికార తెరాస పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. గడిచిన నాలుగేళ్ల కాలం నుంచి ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టులు అందని ద్రాక్షలా మారడంతో ఆశావహులంతా ఉసూరుమంటున్నారు. చివరి సమయంలోనైనా తమ కోరిక ఈడేరుతుందని భావించిన వారు కూడా, ప్రస్తుతం ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో డీలాపడిపోతున్నారు.

08/26/2018 - 04:13

జనగామ టౌన్, ఆగస్టు 25: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పశు సంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జనగామ నియోజకవర్గం పెంబర్తి గ్రామం కుమ్మరికుంటలో శనివారం ఆయన చేప పిల్లలను విడుదల చేసి గొర్రెలు, బర్రెలను పంపిణీ చేశారు.

Pages