S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/26/2018 - 04:11

కోదాడ, ఆగస్టు 25: సాగునీరు ఎక్కడ వుంటుంతో ఆ ప్రాంతం మొత్తం సమగ్రాభివృద్ది చెందుతుందని నల్లగొండ ఎంపీ రైతుసమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కోదాడ ఉత్తమ్ పద్మావతినగర్‌లో శనివారం ప్రగతి మల్టిబ్రాండ్ కారు సర్వీస్ ఫస్ట్ ఛాయిస్‌ను యంపి సుఖేందర్‌రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు.

08/26/2018 - 04:04

హైదరాబాద్, ఆగస్టు 25: వచ్చే నెల 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించుకుని ఏర్పాట్లపై చర్చించుకోవాలని, ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

08/26/2018 - 04:03

హైదరాబాద్, ఆగస్టు 25: నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న డీలర్లకు కమిషన్ పాత బకాయాలను చెక్‌ల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరపరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. డీలర్ల కమిషన్ క్వింటాల్‌కు రూ.20 నుంచి 70 వరకు పెంచామన్నారు. పాత బకాయిలను మరో 15 రోజుల్లో డీలర్లకు అందచేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2015 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న బకాయిలను విడుదల చేయనున్నారు.

08/26/2018 - 04:01

హైదరాబాద్,ఆగస్టు 25: హిమయత్‌నగర్ సత్య డయాగ్నస్టిక్ సెంటర్‌లో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ వివి శర్మ తెలిపారు. శనివారం నాడు ఆసుపత్రిలో ట్యాబ్ సిటి స్కాన్ ఆధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలమానం అనుసరించి ఆసుపత్రికి కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామాన్నరు.

08/26/2018 - 03:59

హైదరాబాద్, ఆగస్టు 25: ఎయిర్‌టెల్ మారథాన్‌లో వీల్ చైర్‌లోనే అపోకాస్ రోగులు పాల్గొని ఇతరులకు స్పూర్తిగా నిలిచారు. శనివారం హైటెక్స్‌లో ఎయిర్‌టెల్ నిర్వహించిన మారథాన్ 5కే రన్‌లో అపోకాస్ నుంచి ముగ్గురు రోగులతో కూడిన మొత్తం 40 మంది ఒక బృందంగా పాల్గొని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు.

08/26/2018 - 04:07

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఏదో ఒక అభిరుచి కలిగి ఉండాలని, అది మనలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో పాటు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తుందని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు పేర్కొన్నారు. గీతం డీమ్డ్ వర్శిటీలోని కళాకృతి విద్యార్థుల ఆధ్వర్యంలో లౌజ్ ఓ ఫీలియా పేరిట గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సాహిత్యోత్సవాన్ని శనివారం నాడు ఆయన ప్రారంభించారు.

08/26/2018 - 03:57

హైదరాబాద్, ఆగస్టు 25: వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని, ఇందుకు అనుగుణంగా ప్రజలకు చేరువ కావాలని భావించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతిష్టాత్మకంగా బస్సు యాత్రను చేపట్టారు.

08/26/2018 - 03:56

హైదరాబాద్, ఆగస్టు 25: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నడుద్దామని పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్‌రెడ్డి వివిధ జిల్లాల నుండి వచ్చిన నేతలను ఉద్ధేశించి పేర్కొన్నారు. పవన్ రాజకీయాల్లో జవాబుదారీతనం, పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా పార్టీ సిద్ధాంతాలను , విధానాలను రూపొందించారని అన్నారు.

08/26/2018 - 03:54

హైదరాబాద్, ఆగస్టు 25: అత్యవసర వాహన సేవల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రసవాల నుంచి మొదలుకుని మరణానంతరం వరకూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాహన సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నదని ఆయన చెప్పారు. రోటరీ క్లబ్, ఉస్మానియా, గాంధీ, కాకతీయ, మెడికల్ కాలేజీల పూర్వ విద్యార్థుల సంఘం సహకారంతో 175 కిట్లను ప్రభుత్వానికి అందించారు.

08/26/2018 - 03:52

హైదరాబాద్, ఆగస్టు 25: ప్రమాణాలు లేకుండా కుప్పలు తెప్పలుగా గ్రాడ్యూయేట్లను పుట్టించడం వల్ల లాభం లేదని, ఉన్నత విద్యా సంస్థలు ప్రమాణాలను పాటించాలని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌యూఈపిఏ-నీపా) మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేబీజీ తిలక్ పేర్కొన్నారు.

Pages