S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/28/2018 - 04:57

చౌటుప్పల్, జూలై 27: దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నాణ్యమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జిల్లాకు ఒకటి ప్యాలీయేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసపత్రిని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు.

07/28/2018 - 04:55

నాగర్‌కర్నూల్, జూలై 27: వ్యవసాయ పొలంలో ఒకేసారి 14 నెమ ళ్లు మృతి చెందిన సంఘటన మరువకముందే అదే ప్రాంతంలో శుక్రవారం మరో ఐదు నెమళ్లు మృత్యువాతకు గురయ్యాయ.

07/28/2018 - 04:40

హైదరాబాద్, జూలై 27: ప్రముఖ జర్నలిస్టు అరవింద్ యాదవ్ రచించిన ఐదు పుస్తకాలు దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన సభల్లో పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈనెల 20న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దేశంలో మొదటి మహిళా కార్డియాలజిస్ట్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మావతి ‘ఖహాని డాక్టర్ సాబ్‌కీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

07/28/2018 - 04:38

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పద్మాచారి విశిష్టసేవా పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఓ వైపు ఉద్యోగ సంఘం నాయకునిగా ఉంటూనే తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసినందుకు గాను పద్మాచారిని ఈ అవార్డు వరించింది.

07/28/2018 - 04:36

చిత్రం..ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్

07/28/2018 - 04:34

హైదరాబాద్, జూలై 27: ప్రభుత్వ శాఖల సమన్వయంతో అడవులను సంరక్షించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపద కారణంగా పర్యావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాలి, నీరు, భూమి తీవ్ర కాలుష్యకోరల్లో నిండిపోతుండగా, దీంతో మానవ మనుగడకు పెను ప్రమాదం ఏర్పడుతోంది.

07/28/2018 - 04:33

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏళ్ల తరబడి ఎన్నిమార్లు చెప్పినా, యూనివర్శిటీలు కేవలం పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ఇవ్వడానికి పరిమితం అవుతున్నాయే తప్ప ఆధునిక సంస్కరణలను అందిపుచ్చుకోవడం లేదు.

07/28/2018 - 04:32

హైదరాబాద్, జూలై 27: దేశంలో ఉన్నత, సాంకేతిక విద్యను విస్తరింపచేయాలనే లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అడిగిన వారందరికీ అనుమతులు ఇవ్వడంతో ప్రమాణాల విషయంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్నత విద్య పూర్తిగా ఇటు రాష్ట్ర అధికారంలోనూ లేక, అటు కేంద్ర అధికారంలో లేకపోవడంతో పర్యవేక్షణ ఇబ్బంది అవుతోంది.

07/28/2018 - 04:31

హైదరాబాద్, జూలై 27: విద్యార్ధులపై జరుగుతున్న వేధింపుల విచారణకు ఒక కమిషన్‌ను నియమించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ), బాలల హక్కుల సంఘం (బీహెచ్‌ఎస్), హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం (హెచ్‌ఎస్‌పీఏ) సంయుక్తంగా డిమాండ్ చేశాయి. సంఘాల నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలను నిరోధించాలని అన్నారు.

07/28/2018 - 04:30

హైదరాబాద్, జూలై 27: ఐటీ కంపెనీలపై సామాజిక బాధ్యత ఉందని, దానిని గుర్తెరిగి ఆ కంపెనీలు వ్యవహరించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైటెక్స్‌లో శుక్రవారం జరిగిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ అసోసియేషన్ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి మురళీ బొళ్ల అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఐదు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులను అందజేశారు.

Pages