S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/27/2018 - 04:44

నర్సాపూర్, జూలై 26: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టీసీని తీర్చిదిద్ధేందకు నిరంతరం కృషి చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

07/27/2018 - 04:41

మంగపేట, జూలై 26: రేపటి నుండి జరగనున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం ఏజెన్సీలోని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు ఉద్యమంలో అమరులైన వారిని స్మరిస్తూ ఏటా జూలై 28 నుండి ఆగస్టు మూడు వరకు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించుకుంటారు.

07/27/2018 - 05:09

హైదరాబాద్: సాంకేతిక ఫలాలు సామాన్యుడికి అందినపుడే, నిజమైన పురోభివృద్ధి అని ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. సామాన్యుడికి సాంకేతిక ఫలాలు అందనపుడు సాంకేతిక నైపుణ్యత ఎంత ఉన్నా ఫలితం నిష్ప్రయోజనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీ హిల్స్‌లోని టీసాట్ కార్యాలయంలో గురువారం నాడు జరిగిన ప్రధమ వార్షికోత్సవ సభకు తారకరామారావు హాజరయ్యారు.

07/27/2018 - 02:59

హైదరాబాద్, జూలై 26: రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామ కార్యదర్శుల నియామకానికి మంత్రిమండలి ఆమోదించనుంది. ఆగస్టు ఒకటి నుంచి కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి రానున్న నేపథ్యంలో వీటికి గ్రామ కార్యదర్శులను నియమించనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

07/27/2018 - 02:58

హైదరాబాద్, జూలై 26: ఫీజులు చెల్లించలేక, టీచర్లు కొట్టారని, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యలో కొంత మంది ప్రేమ, సామాజిక మాద్యమాల ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు, ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఎక్కువ మంది చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

07/27/2018 - 02:57

హైదరాబాద్, జూలై 26: హరితహారం పేరుతో పోడు భూములను లాక్కొంటే సహించబోమని రాష్ట్ర సదస్సులో వక్తలు హెచ్చరించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో పోడు భూముల రక్షణకై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, సున్నం రాజయ్య, రంగారావు, తండ్ర కుమార్, సాగర్, పశ్యపద్మ, జానకి రాములు, ప్రసాద్, వేణు హాజరై ప్రసంగించారు.

07/27/2018 - 02:57

హైదరాబాద్, జూలై 26: పాడిగేదెల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

07/27/2018 - 02:54

హైదరాబాద్, జూలై 26: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) జాతీయ బోర్డు అనధికార డైరెక్టర్‌గా నియమిస్తూ రక్షణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మేడ్చెల్ జిల్లా బౌరంపేట సర్పంచ్‌గా, గోల్కొండ గ్రామీణ బ్యాంకు డైరెక్టర్‌గా , పార్టీ ఉమ్మడి రాష్ట్రాల కమిటీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

07/27/2018 - 02:53

హైదరాబాద్, జూలై 26: గ్రామాలను అభివృద్ది చేసేందుకు, ప్రజలకు వౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. కొత్తగా పంచాయతీ కార్యదర్శులను నియమించడంతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వడంపై టీఎన్‌జీఓల కార్యదర్శులు సంఘం హర్షం వ్యక్తం చేసింది.

07/27/2018 - 02:52

హైదరాబాద్, జూలై 26: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రారంభించిన సెల్ఫీ విత్ క్యాంపస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రాఘవేందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 1.65 లక్షల క్యాంపస్‌లలో ప్రారంభిస్తున్నామని చెప్పారు.

Pages