S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/27/2018 - 02:52

హైదరాబాద్, జూలై 26: కాంట్రాక్టు అధ్యాపకులకు ఎపుడెపుడు మోక్షం కలుగుతుందా అని ఎదురుచూస్తున్న అధ్యాపకులు వారి కుటుంబాలకు 27న జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో చట్టసవరణ నిర్ణయం తీసుకుని సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ కాంట్రాక్టు అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకులు కొప్పిశెట్టి సురేశ్, సయ్యద్ జబీ ఉల్లా, శ్రీనివాస్‌రెడ్డి, దేవందర్, శోభన్ కోరారు.

07/27/2018 - 02:51

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) ప్రజలు స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు ముందుకు వస్తే భారీగా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గురువారం జీఓ జారీ అయింది. బీసీ సహకార ఆర్థిక సంస్థ, బీసీ ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలను నియమించారు.

07/27/2018 - 22:08

హుజూరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో మల్బ రీ సాగుకు, పట్టు ఉత్పత్తికి పూర్వవైభవం తీసుకురావాలని, ఇందుకు రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం సింగాపురంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సెరీకల్చర్, హార్టీకల్చర్ ఆధ్వర్యంలో 14 జిల్లాల మల్బరీ రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది.

07/25/2018 - 06:36

హైదరాబాద్, జూలై 24: భారత్ నుండి విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారి సంఖ్య లక్షల్లో పెరుగుతున్న తరుణంలో విదేశీ విద్యార్థులను భారత్‌కు ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టడీ ఇండియా పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో చాలా తక్కువ సంఖ్యలో ఆసియా దేశాలకు చెందిన వారు మాత్రమే భారత్‌కు చదువుకునేందుకు వచ్చేవారు.

07/25/2018 - 06:35

హైదరాబాద్, జూలై 24: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ తుది విడత కౌనె్సలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం నాడు ప్రకటించారు.

07/25/2018 - 06:34

హైదరాబాద్, జూలై 24: తమ సమస్యలను పరిష్కరించాలంటూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. పెట్రోల్, డిజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం తో పాటు టోల్‌గేట్ ఫ్రీ ఇండియాగా ప్రకటించాలన్న ప్రదాన డిమాండ్లతో జాతీయ స్థాయిలో లారీ యజమానులు సమ్మెకు పిలుపు నిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడు లక్షల లారీలు ఎక్కడివి అక్కడే నిలిచి పోయాయి.

07/25/2018 - 06:33

చర్ల, జూలై 24: గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తిరిగి కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రాచలం ఏజెన్సీ చర్ల మండల పరిధిలోని దండకారణ్యంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందాడు.

07/25/2018 - 06:31

హైదరాబాద్, జూలై 24: ‘కాంగ్రెస్ పార్టీని వీడకండి ప్లీజ్..’ అని పార్టీ తెలంగాణ కమిటీకి ఇటీవల ఇన్‌ఛార్జీగా నియమితులైన ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్‌ను కోరారు. ముఖేష్ గౌడ్ పార్టీ మారుతారన్న ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 20 రోజుల క్రితం టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖేష్ గౌడ్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

07/25/2018 - 01:22

హైదరాబాద్, జూలై 24: ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నేతలు రాష్టవ్య్రాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పేదలు, రోగులకు పండ్లు పంపిణీ, రక్తదానం, మొక్కలు నాటడం వంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.

07/25/2018 - 01:22

సూర్యాపేట, జూలై 24: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ. 3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించా రు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ చైతన్యయాత్ర మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది.

Pages