S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/24/2018 - 04:45

కాగజ్‌నగర్, జూలై 23: కాగజ్‌నగర్‌లో మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లును వచ్చే ఆగస్టు 19న తమ అధీనంలోకి తీసుకున్న ఆరు నెలలోపు ఉత్పత్తి ప్రారంభిస్తామని దీనికి అందరి సహాకారం తీసుకుంటామని జేకే పేపర్ మిల్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

07/24/2018 - 04:43

సిద్దిపేట, జూలై 23: బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల వైఖరి పార్లమెంట్ సాక్షిగా రుజువైందని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు వ్యతిరేకంగా విషం గక్కుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క మాట మాట్లడకపోవటం ఆ పార్టీనేతల నైజాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు.

07/24/2018 - 04:40

మహబూబాబాద్, జూలై 23: పాస్‌బుక్కు.. పంట చెక్కు.. భూమిపై హక్కు అందరికి దక్కేదాకా రైతులపక్షాన పోరాటం ఆగదని తెలంగాణ జనసమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుదీక్ష కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం రైతులతో కలిసి పాల్గొన్నారు.

07/24/2018 - 04:38

చిత్రం..వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికార నివాసం బంజారాహిల్స్‌లో
పలు గ్రామాల రైతులతో ముఖాముఖి సమావేశమై
కూరగాయల సాగులో మెళకువలను వివరిస్తున్న దృశ్యం

07/24/2018 - 04:36

ఆదిలాబాద్, జూలై 23: ప్రాణహిత తుమ్మడిహెట్టి వద్దే బ్యారేజీ నిర్మించాలని, వార్దా నదిపై ప్రతిపాదనలు విరమించుకోవాలని ఓవైపు విపక్ష రాజకీయ పార్టీలు ఆందోళన సాగిస్తున్న నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తుమ్మడిహెట్టి వద్దే బ్యారేజీ నిర్మిస్తామని చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

07/24/2018 - 04:31

గద్వాల, జూలై 23: ఎగువ ప్రాంతంలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద నీరు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో జూరాలకు 1,58,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. సోమవారం సాయంత్రం నాటికి జూరాల జళాశయంలో 318.34 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంచుకొని ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న లక్షా 58వేల క్యూసెక్కుల వరద నీటిని 13 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.

07/24/2018 - 04:22

హైదరాబాద్, జూలై 23: ఐఐటి స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఆగస్టు 5న రాష్టప్రతి రామ్‌నాథ్ గోవింద్ హైదరాబాద్ రాక సందర్భంగా బందోబస్తు, ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ప్రోటోకాల్, పోలీస్, జిహెచ్‌ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్, వైద్యఆరోగ్యశాఖ, ఫైర్, రెవిన్యూ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

07/24/2018 - 04:21

హైదరాబాద్, జూలై 23: ఆమ్ ఆద్మీ పార్టీ తన చెట్టు కొమ్మలను తెలంగాణలోనూ విస్తరించేందుకు వ్యూహ రచన చేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో అడుగు వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శిష్యురాలు తెలంగాణ ప్రియాంక కర్కర్ మూడు రోజులుగా నగరంలోనే మకాం వేశారు. ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో పార్టీ తెలంగాణ విభాగం ముఖ్య నేతలతో (కోర్ కమిటీ) సమావేశమై చర్చించారు.

07/24/2018 - 04:19

హైదరాబాద్, జూలై 23: దేశ సంస్కృతిలో మూలంగా నిలిచిన నాలుగు వేదాలను సులభమైన తెలుగు భాషలో అనువదించినందుకు తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం అధ్యక్షుడు ఎం వీ నరసింహారెడ్డికి ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు.

07/24/2018 - 04:17

హైదరాబాద్, జూలై 23: ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో తెలంగాణ రాష్ట్రానికి పొందుపరిచిన అంశాలను, హామీలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు సూచించారు. సోమవారం తెలగాణ టీడీపి అధ్యక్షుడు ఎల్.

Pages