S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/23/2018 - 02:55

హైదరాబాద్, జూలై 22: పద్మశ్రీ అవార్డు గ్రహీత, తన జీవితాన్ని మొక్కలు నాటేందుకే అంకితం చేసిన వనజీవి రామయ్య సవాలును మంత్రి జోగు రామన్న స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా వనజీవి రామయ్య గవర్నర్ నర్సింహన్, ముఖ్యంత్రి కేసీఆర్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నలకు మొక్కలు నాటాలని సవాలు విసిరారు. ఆదిలాబాద్ నుంచి దీనిని స్వీకరించిన మంత్రి జోగు రామన్న జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో మూడు మొక్కలను నాటారు.

07/23/2018 - 02:53

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించేలా, ఉరివేసేలా టిడిపి అవిశ్వాస తీర్మానం పెడితే తాము ఎలా మద్దతు ఇస్తామని టిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనలేదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమను విమర్శిస్తున్నారని, ఆయన ఉద్దేశం తాము టిడిపికి మద్దతు ఇవ్వాలనా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు.

07/23/2018 - 02:51

హైదరాబాద్, జూలై 22: తన జన్మదినం సందర్భంగా బొకేలతో శుభాకాంక్షలు చెప్పవద్దని, తనను అభిమానించే వారంతా మొక్కలు నాటితే సంతోషిస్తానని కేటీఆర్ సూచించారు. మన ఇళ్లలో జరిగే వేడుకలు, మనం అభిమానించే వారి పుట్టిన రోజుల నాడు ఓ మొక్కను నాటడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. బొకేలు వాడే పూలు సైతం మొక్కల నుంచి సేకరించిన కనుక వాటిని పాడుచేయకుండా తాను సూచించిన విధంగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.

07/23/2018 - 02:50

హైదరాబాద్, జూలై 22: ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తూ, ప్రజలకు చేరువ కావాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. ముందస్తు ఎన్నికలపై ఊహగానాలు వీస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ విధంగా నిర్ణయించింది. పార్టీని గ్రామ, గ్రామానికి తీసుకెళ్ళి, మరింత పటిష్టం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నది.

07/23/2018 - 02:50

హైదరాబాద్, జూలై 22: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచి, భవిష్యత్ తరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో హరితహారాన్ని మహోద్యమంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈనెల 27న దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బృత్తర పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఒక్కరోజే లక్షా, 116 మొక్కలు నాటనున్నారు.

07/23/2018 - 02:49

హైదరాబాద్, జూలై 22: తెలంగాణలో వర్షాలు భారీగా లేకపోయినా, కర్నాటక, మహారాష్టల్రలో కురిసిన వర్షాల వల్ల కృష్ణానదికి వరద పోటు భారీగా పెరిగింది. ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

07/23/2018 - 02:48

హైదరాబాద్, జూలై 22: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల (స్పెషలాఫీసర్ల) పరిపాలన వచ్చే నెల 2న హంగామాగా ప్రారంభం అవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టు 1తో ముగుస్తుంది. సర్పంచ్‌లు తమ పదవీ కాలాన్ని తదుపరి ఎన్నికలు జరిగేవారకు పొడగించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఫలితం రాలేదు.

07/23/2018 - 01:29

వరంగల్, జూలై 22: గోదావరి లిఫ్టు ఇరిగేషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 3220కోట్లతో ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలోని లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు పరిపాలన అనుమతులు లభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు రెండవ వారంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్నారని అన్నారు.

07/23/2018 - 01:27

నిజామాబాద్, జూలై 22: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ఇప్పటికీ ఆయకట్టు రైతుల్లో పూర్తిస్థాయి భరోసాను నింపలేకపోతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న ఈ ప్రాజెక్టులో వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినప్పటికీ, అత్తెసరు నీటి నిల్వలు మాత్రమే వచ్చి చేరడమే ఇందుకు కారణం.

07/22/2018 - 06:13

నల్లగొండ, జూలై 21: కృష్ణానది ప్రవాహం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులను దాటి తెలంగాణలో పరవళ్లు తొక్కుతుండటంతో జూరాల, తుంగభద్రల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నీరు చేరుతుండటం దిగువన నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పంటల సాగుపై ఆశలు రేపాయి.

Pages