S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/22/2018 - 06:12

* 100 కోట్ల మొక్కలు నాటాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
* అటవీ అభివృద్ధికి కేంద్రం రూ.2,200 కోట్లు బకాయ
* నిధుల విడుదలలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం..
* కొత్త చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ పంచాయతీలదే..

07/22/2018 - 06:10

గద్వాల, జూలై 21: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం నాటికి ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు వద్ద అధికార యంత్రాం గం అప్రమత్తమై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జూరాల జలాశయంలో 318.350 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

07/22/2018 - 06:09

సూర్యాపేట, జూలై 21: తెలంగాణలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని గోదాములను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి ఈ-రశీదు విధానాన్ని అమలుపర్చనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.

07/22/2018 - 06:08

బోధన్, జూలై 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నిజాంచక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా పూర్వ వైభవం తీసుకువస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల హామీపై నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మరో పోరు మొదలయ్యింది.

07/22/2018 - 06:05

మహబూబ్‌నగర్, జూలై 21: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్లిన ఏ జిల్లాలో పర్యటించిన తెలంగాణలో 24గంటల కరెంట్‌ను సరఫరా చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నానని, అసలు విషయం కేసీఆర్‌కు తెలిసి కూడా ఆ క్రెడిట్ ఇతరుల ఖాతాలో పడకూడదనే దుర్బుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు.

07/22/2018 - 05:49

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ పౌరులకు పంద్రాగస్టున ‘కంటివెలుగు’ ఉచిత కంటిపరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో కంటిపరీక్షలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పంద్రాగస్టు రోజున తాను గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కంటివెలుగు ఉచిత కంటిపరీక్షల శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

07/22/2018 - 05:48

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూత ఇస్తుందని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) హామీ ఇచ్చారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ దీపక్ ఖేత్రపాల్ శనివారం ఇక్కడ మంత్రి కేటీఆర్‌ను కలిసి చర్చించారు.

07/22/2018 - 05:46

హైదరాబాద్, జూలై 21: ఎంతో కాలంగా ఊరిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర రాజధానిలో నవంబర్ నుంచి పరుగులు తీయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు పూర్తిచేసింది. కాలుష్యాన్ని వెదజల్లని బస్సులు ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.

07/22/2018 - 05:45

హైదరాబాద్, జూలై 21: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట సమరానికి ఊపిరిలూదిన రాజ్ బహదూర్ గౌర్ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని బహదూర్ శతజయంతి సభలో పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. శనివారం ఇక్కడ గౌర్ శతజయంతి ఉత్సవాల సభ నిర్వహించారు.

07/22/2018 - 05:44

హైదరాబాద్, జూలై 21: విద్యుత్ డిస్కంమ్ యాజమాన్య, కార్మికుల మధ్య చర్చల్లో సయోధ్య కుదరకపోవడంతో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు శనివారం నుంచి సమ్మెలో పాల్గొన్నారు. దాదాపు 18 వేల మంది సమ్మెలో పాల్గొన్నారని హెచ్ 52 యూనియన్ నేతలు శివశంకర్,సాయల్ తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇతర కార్మిక యూనియన్లు సైతం సమ్మెలో పాల్గొనున్నాయని వారు తెలిపారు.

Pages