S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2018 - 05:36

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని పాఠశాలల్లో టీచర్ల కొరతపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పందించారు. ముఖ్యంగా రాజ్‌భవన్ పాఠశాలలోనూ టీచర్ల కొరతపై ఆయన ఆరా తీయడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ నెలాఖరులోగా స్కూళ్లలో టీచర్ల కొరతను తీరుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఏ పాఠశాలలోనూ టీచర్ల కొరత లేకుండా చూస్తామని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కడియం పేర్కొన్నారు.

07/21/2018 - 05:34

హైదరాబాద్, జూలై 20: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీలు చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వం మాట నిలుపుకోవాలని కోరుతూ వందలాది మంది ఇంటర్ విద్య కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. దీనితో బోర్డు కార్యాలయం, కమిషనర్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

07/21/2018 - 05:33

హైదరాబాద్, జూలై 20: దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్న సింగరేణి సంస్థ నూతన సమాచార వ్యవస్థను అందిపుచ్చుకోవడానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి గనుల్లో చేపడుతున్న పనుల ప్రగతిపై మల్టీ డిపార్టుమెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమాలను స్థానిక ఏరియా జనరల్ మేనేజర్లు పర్యవేక్షణలో సదస్సులు ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ ఆదేశాలు జారీ చేశారు.

07/21/2018 - 05:31

హైదరాబాద్, జూలై 20: తెలంగాం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను నష్టాల నుంచి అధిగమిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని సంస్ధ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రైవేటు వాహనాల పోటీని తట్టుకుంటూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

07/21/2018 - 05:30

హైదరాబాద్, జూలై 20: ప్రభుత్వం పేదల కోసం ఖర్చు చేస్తున్న ఒక్క రూపాయి కూడా అనర్హులకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/21/2018 - 05:29

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాలకు మరో 772 మంది టీచర్లను త్వరలో నియమిస్తామని, మరో 1863 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మైనారిటీ సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ కార్యదర్శి దాన కిశోర్, డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసిం, షుకూర్, విక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

07/21/2018 - 05:28

హైదరాబాద్, జూలై 20: జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకులు మూడు పురస్కారాలు అందుకున్నాయి. రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య ప్రతి ఏడు జాతీయ స్థాయిలో ఈ అవార్డులను అందజేస్తుంది. 2016-17 సంతవ్సరానికి గాను టీ ఎస్ అపెక్స్ బ్యాంకు ప్రధమ బహుమతిని అందుకోంది.

07/21/2018 - 05:27

హైదరాబాద్, జూలై 20: అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి త్వరలో ఆయుధాలు సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ శాఖ అధికారుల వద్ద ఆయుధాలు ఉన్నటికీ మావోయిస్టులు తరచూ ఎత్తుకెళ్లడం, బెదిరింపుల కారణంగా వాటిని పోలీస్‌శాఖకు అప్పగించారు. దీంతో చిన్నపాటి సమస్య ఎదురైనా పోలీస్‌శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా వేటగాళ్లు, స్మగ్లర్లు రెచ్చిపోయారు.

07/20/2018 - 06:06

హైదరాబాద్, జూలై 19: తమ డిమాండ్‌ల సాధన కోసం సమ్మె బాట తప్పడంలేదని, ఈనెల 21 నుంచి నిరవధికంగా సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సంఘం వెల్లడించింది. ఈ మేరకు కాంట్రాక్టు కార్మికుల జెఎసి నేతలు సమ్మెపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కార్మిక నేతలు సమ్మెబాటకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కార్మికశాఖ చర్చలకు రండి అంటూ కార్మిక నేతలకు సమాచారం పంపింది.

07/20/2018 - 06:05

హైదరాబాద్, జూలై 19: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉన్న ఖాళీల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ రెండు వేర్వేరు ప్రకటనలను విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది.

Pages