S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/20/2018 - 06:03

హైదరాబాద్, జూలై 19: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్యా కమిషన్‌పై రాష్ట్ర ప్రజలు, నిపుణులు, అధికారుల అభిప్రాయాలతో కూడిన నివేదికను ఉన్నత విద్యా మండలి అధికారులు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్‌ను కలిసి అందజేశారు.

07/20/2018 - 06:02

హైదరాబాద్, జూలై 19: ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో జెఎన్‌టీయూహెచ్ విద్యార్థులు అదరగొట్టారు. క్యాంపస్ నియామకాల తొలిదశలోనే 24 మంది విద్యార్థులు మంచి వేతనాలకు వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు. ఏటా 36 లక్షల వేతనానికి పి నిఖిలను మైక్రోసాఫ్ట్ ఎంపిక చేయగా, ఏటా 24 లక్షల వేతనానికి వి శ్రీసాయి పూజితను మైక్రో సాఫ్ట్ ఎంపిక చేసింది.

07/20/2018 - 06:00

హైదరాబాద్, జూలై 19: ఉపాధి కల్పనా అవకాశాలను మెరుగుపరచేందుకు జిల్లా స్థాయిలో అప్రెంటిస్ కమిటీలను ఏర్పాటు చేశారు. 31 జిల్లాల్లో ఈ తరహా కమిటీలను ప్రభుత్వ గురువారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఒక జీఓ (ఎంఎస్ నెంబర్ 37) జారీ అయింది. జిల్లా అప్రెంటిస్ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ కన్వీనర్‌గా ఉంటారు.

07/20/2018 - 05:59

హైదరాబాద్, జూలై 19: టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషమంగా మారిందని, చెల్లింపులు నిలిచిపోయాయని బీజేపీ మండిపడింది.

07/20/2018 - 05:49

హైదరాబాద్, జూలై 19: వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం, నిజామాబాద్ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఈ ఐదు ప్రాంతాలలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మంత్రి ఆదేశించారు.

07/19/2018 - 22:17

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా భారీ ఎత్తున ఔషధ మొక్కల తోటను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ సమీపంలోని ఆయుష్ శాఖకు చెందిన 24 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డుకు కేటాయించింది. బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాలకు చెందిన 58 ఎకరాల భూమిలో మెడిసినల్ ప్లాంట్ బోర్డుకు 24 ఎకరాల భూమిని కేటాయించారు.

07/19/2018 - 22:12

హైదరాబాద్, జూలై 19: ప్రభుత్వ పాఠశాలల్లో బదిలీల ప్రహసనం విద్యార్ధుల మెడకు ఉచ్చులా మారింది. స్కూళ్లలో టీచర్లు ఉన్నారు కదా అని ప్రభుత్వ స్కూళ్లను ఎంచుకుని చేరిన విద్యార్ధులకు తాజా పరిస్థితి శాపంగా మారింది. గత నెల పాఠశాలలు ప్రారంభించింది మొదలు టీచర్లు బదిలీల్లోనే నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయినా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారు కదా అని ఎదురుచూసిన విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి.

07/19/2018 - 06:30

హైదరాబాద్, జూలై 18: వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పసుపు, మిర్చి పంటల సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మెనేజ్‌మెంట్, మార్కెట్ లింకేజ్, బయ్యర్ సెల్లర్స్ మీట్, ధరల స్థీరీకరణ బాయిలర్స్, పాలీషర్స్ సరఫరా, విత్తనాల అందుబాటు తదితర అంశాలను రోడ్ మ్యాప్ తయారిలో పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సూచించారు.

07/19/2018 - 06:29

హైదరాబాద్, జూలై 18: పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థ తన హైదరాబాద్ క్యాంపస్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నది. ఈ మేరకు అగ్రగామి మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన వోరెర్ కార్స్‌లో టాటా మోటార్స్ భాగస్వామిగా మారింది. ఆన్ గ్రౌండ్ ఆపరేషన్స్ అండ్ ప్లీట్ మేనేజ్‌మెంట్ విలువ జోడించిన సేవలతో ఈ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్‌ను కాగ్నిజెంట్‌కు అందిస్తోంది.

07/19/2018 - 06:28

హైదరాబాద్, జూలై 18:ఎంసెట్-2 లీకేజిలో నిందితులుగా ఉన్న వారికి మరో 14 రోజులు జుడీషయల్ కష్టడీకి అనుమతించినట్లు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్-2 లీకేజి కుంభకోణంలో నిందితులుగా ఉన్న వాసుబాబు, శివనారాయణతో పాటు మరో కీలక వ్యక్తిని గుర్తించినట్లు సిఐడి పోలీసులు చెబుతున్నారు. ఎంసెట్ నింధితులు గత కొంతకాలంగా సిఐడి కష్టడీలో ఉన్నారు.

Pages