S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/28/2018 - 05:40

హైదరాబాద్, జూన్ 27: ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకే వెబ్ కౌనె్సలింగ్ తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం అంతకంటే ముందే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తమకు కావాల్సిన వారందరికీ బదిలీలు చేసిందని, ఇది కౌనె్సలింగ్ పారదర్శకతకు భిన్నమైన వ్యవహారమని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

06/28/2018 - 05:39

హైదరాబాద్, జూన్ 27: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనలో ప్రతిష్టంబన నెలకొన్నందున తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిసి గణాంకాల వివరాలు వెల్లడించడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కేసేఆర్ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

06/28/2018 - 05:38

హైదరాబాద్, జూన్ 27: పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలు, కల్పిస్తోన్న ప్రోత్సహకాలపై విదేశాలలో బాగా ప్రచారం చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కేంద్ర బృందానికి సూచించారు.

06/28/2018 - 05:37

హైదరాబాద్, జూన్ 27: రెవెన్యూ శాఖలో ప్రమోషన్లకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం రెండు కమిటీలను ఏర్పాటు చేస్తూ వేర్వేరుగా రెండు జీఓలు జారీ అయ్యాయి. డిప్యూటీ తహశీల్దార్లకు ప్రమోషన్ ఇస్తూ తహశీల్దార్లుగా నియమించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా సీసీఎల్‌ఏ (చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ఉంటారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ మెంబర్‌గా, సీసీఎల్‌ఏ కార్యదర్శి మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు.

06/28/2018 - 05:36

హైదరాబాద్, జూన్ 27: విభజన అనంతరం తొరిసారిగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నేతల కనుసన్నుల్లో ప్రచార పర్యవేక్షణ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 29వ తేదీన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

06/28/2018 - 05:34

హైదరాబాద్, జూన్ 27: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత గడువులోగా నిర్వహించేందుకు ఏ కారణంతోనైనా వీలుకాకపోతే సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్లు) నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, సభ్యుల కాలపరిమితి 2018 జూలై 31 తో ముగుస్తుంది. ఈ లోగా ఎన్నికలు జరిగితే ఆగస్టులో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు వీలయ్యేది.

06/26/2018 - 23:39

మహబూబ్‌నగర్, జూన్ 26: కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజాధనాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుని ఈ రాజ్యం తనదేనంటూ వ్యవహరిస్తూ త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ జనచైతన్య యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు.

06/26/2018 - 23:37

సూర్యాపేట, జూన్ 26: ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో మంగళవారం రైతు బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

06/26/2018 - 23:35

హైదరాబాద్, జూన్ 26: ఆసుపత్రుల నిర్వహణ, అనుసంధానం తదితర రంగాల్లో ఉన్నతంగా స్థిరపడాలనుకునే వారి కోసం నిజాం ఇన్సిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సును ఆఫర్ చేస్తున్నారు.

06/26/2018 - 23:33

నిజామాబాద్, జూన్ 26: పసుపు రైతుల ప్రయోజనార్థం సాధ్యమైనంత త్వరగా జిల్లాలో స్పైస్ సెల్ (సుగంధ ద్రవ్యాల విభాగం)ను ఏర్పాటు కానుందని ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. పసుపు బోర్డు కోసం గత ఎంతోకాలం నుండి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో, స్పైస్‌సెల్ ఏర్పాటుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్‌ప్రభు ఆమోదం తెలిపారని అన్నారు.

Pages