S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/26/2018 - 06:03

హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత నుండి ఎదురవుతున్న నిరసనలకు పరిష్కారంగా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని యోచిస్తోంది. యువతకు నెలకు 2 వేలు చొప్పున ఏడాదికి 24వేల రూపాయిలు నిరుద్యోగ భృతి ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల్లో ఎదురవుతున్న నిరాశ, నిస్పృహలను పారద్రోలవచ్చని భావిస్తోంది. రాష్ట్రంలో తాజా అంచనాల ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులున్నారు.

06/26/2018 - 05:13

హైదరాబాద్, జూన్ 25: రాజధానిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. సోమవారం మెట్రోరైల్ భవన్‌లో మంత్రులు కే తారకరామారావు, మహేందర్ రెడ్డి మెట్రోరైల్ కనెక్టివిటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

06/26/2018 - 05:12

హైదరాబాద్, జూన్ 25: గ్రామ, పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఇటీవల తెలంగాణకు ఎఐసిసి నుంచి నియమితులైన ముగ్గురు కార్యదర్శులకూ పార్టీనీ సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లను ముగ్గురికీ పంచారు. అంటే ఒక్కోక్కరికీ 40 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున కేటాయింపు జరిగింది.

06/26/2018 - 05:12

హైదరాబాద్, జూన్ 25: రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యసంస్థల ఫీజు దోపిడీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవాచార్యకు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పలువురు బీసీ సంఘాల నాయకులు సచివాలయానికి వెళ్లి లోని ముఖ్య కార్యదర్శిని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.

06/26/2018 - 05:11

హైదరాబాద్, జూన్ 25: కొత్త రైల్వే శాటిలైట్ టెర్మినళ్ల ఏర్పాటు ప్రతిపాదన ఏమాత్రం ముందుకు కదలడం లేదు. నగరంపై విపరీతంగా ట్రాఫిక్ ప్రభావం పడుతున్న సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి కొన్ని రైళ్లను కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన టెర్మినళ్లకు మళ్లించాలని ద.మ.రైల్వే ప్రతిపాదించింది.

06/25/2018 - 05:57

హైదరాబాద్, జూన్ 24: రేషన్ డీలర్లతో ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. డీలర్ల సమస్యలపై అధ్యాయనానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నామని, కమిటీ నివేదిక వచ్చే వరకు సమ్మె విరమించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని డీలర్ల సంఘం అంగీకరించలేదు. దీంతో తమ సమ్మెను కొనసాగుతుందని డీలర్ల సంఘం ప్రకటించింది.

06/25/2018 - 05:55

హైదరాబాద్, జూన్ 24: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ఢిల్లీ పర్యటనపై మళ్లీ ఊహగానాలు ప్రారంభమయ్యాయి. లోగడ పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీకీ అత్యంత సన్నిహితునిగా ఉన్నప్పటికీ చివరికి టీఆర్‌ఎస్‌లో చేరడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్మయం చెందిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కే.

06/25/2018 - 05:55

హైదరాబాద్, జూన్ 24: పర్యవరణాన్ని రక్షించడానికి సింగరేణి సంస్థ ఇక నదుల ఇసుకను వాడకుండా పూర్తిగా వైదొలగుతోంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఆధునిక యంత్రాలతో మట్టినుంచి ఇసుకను బయటకు తీసుకురావడానకి సింగరేణి సంస్థ యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. సింగరేణికి చేదోడువాదోడుగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ తీసుకుంటున్న చర్యలతో దేశ వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు సింగరేణి వైపు సూస్తున్నాయి.

06/25/2018 - 05:53

హైదరాబాద్, జూన్ 24: 2020 జూన్ నాటికి తెలంగాణలో ఎక్కడ చూసినా ఆకుపచ్చ తెలంగాణే కనబడుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో రూ. లక్ష కోట్ల పంట పండబోతుందన్నారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర రెవిన్యూ ఆదాయం 20 శాతం పెరిగి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.

06/25/2018 - 05:51

హైదరాబాద్, జూన్ 24: థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించి సౌర విద్యుత్‌ను వాడుతున్నందున విద్యుత్ నష్టాలు తగ్గాయని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జనరల్ మేనేజర్ సంధ్యారాణి చెప్పారు. ఉత్తర డిస్కంలో తీసుకువస్తున్న వినూత్న విధానాలు అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. సౌర విద్యుత్ వాడకంలో తీసుకువచ్చిన సంస్కరణలతో తనకు అవార్డు రావడం జరిగిందన్నారు.

Pages