S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/08/2018 - 04:54

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూన్ 7: అవినీతి నిరోధక శాఖ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. పెద్దపెద్ద భవనాలు, కోట్లు విలువ చేసే ప్లాట్లు, కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ భీమ్‌రావు ఇంటిపై గురువారం ఏసీబీ దాడులు చేసింది.

06/07/2018 - 05:56

హైదరాబాద్, జూన్ 6: రోడ్లుభవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా (ఏఈఈ) రిక్రూట్ అయిన 102 మంది అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలు ఇచ్చారు. ఆర్ అండ్ బీ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలను రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2016 లో 77 మంది ఏఈఈలను 41 మంది ఏఈలను నియమించుకున్నామన్నారు.

06/07/2018 - 05:55

హైదరాబాద్, జూన్ 6: మృగశిరకార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈసారి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముందన్న సమాచారంతో అధికారులు ప్రజల సౌకర్యార్దం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కాస్త ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరిశీలించారు.

06/07/2018 - 05:54

హైదరాబాద్, జూన్ 6: హైదరాబాద్ మహానగర పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే 42 చోట్ల మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణానికి ఆసక్తి కరబర్చే (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) సంస్థల నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో బిడ్‌లను ఆహ్వానించనున్నట్టు ప్రకటించింది.

06/07/2018 - 05:53

హైదరాబాద్, జూన్ 6: టీచర్ల బదిలీల్లో అయోమయం , గందరగోళం కొనసాగుతోంది. బుధవారం నాడు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతోనూ, జాక్టో నేతలతోనూ సుదీర్ఘంగా చర్చించారు. టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి సీనియర్ అధికారులతోనూ ఉప ముఖ్యమంత్రి చర్చించారు. బదిలీలకు ఆన్‌లైన్ ఉపయోగించాలా?

06/07/2018 - 05:52

హైదరాబాద్, జూన్ 6: దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు అన్నీ తప్పనిసరి అక్రెడిటేషన్ తీసుకోవాలని, లేకుంటే ఆయా సంస్థల గుర్తింపును రద్దు చేయకతప్పదని యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి డాక్టర్ రజనీష్ జైన్ యూజీసీ ప్రమాణాల అమలుపై ఆదేశాలు జారీచేశారు. ఇపుడిపుడే మొదలైన విద్యాసంస్థలకు అక్రిడిటేషన్ తీసుకునే గడువును నాలుగేళ్లపాటు ఇచ్చారు.

06/07/2018 - 05:50

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మార్కెటింగ్ శాఖలో 200 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్, 13 గ్రేడర్, 9 బిల్ క్లర్కు పోస్టులు, 60 జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జండా ఊపింది.

06/07/2018 - 05:49

హైదరాబాద్, జూన్ 6: సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థ సిఎండి శ్రీ్ధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

06/06/2018 - 05:25

హైదరాబాద్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతవరణాన్ని అందించేడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ మార్చలన్న లక్ష్యంతోనే తెలంగాణ హరితహారాన్ని ప్రారంభించామన్నారు. నాలుగవ విడత హరితహారాన్ని జూలైలో ప్రారంభించనున్నట్టు సిఎం ప్రకటించారు.

06/06/2018 - 05:25

నిడమనూరు, జూన్ 5: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశానని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.

Pages