S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/06/2018 - 05:23

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణకు అవసరమైన విద్యుత్ కొనుగోలుపై చత్తీస్‌గఢ్ రాష్ట్రం తిరకాసు పెట్టింది. మార్వా విద్యుత్ థర్మల్ ప్లాంట్ నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగినందున విద్యుత్ ధరలు పెంచాల్సి వచ్చిందని చత్తీస్‌గఢ్ వాదిస్తోంది. వచ్చే నవంబర్ నాటికి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది.

06/06/2018 - 05:22

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌టిసి కార్మిక యూనియన్‌ల మధ్య మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. జీత భత్యాల వ్యత్యాసలపై చర్చించడానకి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఈనెల 11న సమ్మె బాట పట్టాలని గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ సంస్థ కార్మికులకు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ ఈ నెల 8న చర్చలకు రావాలని మజ్దూర్ యూనియన్ నేతలకు సమాచారం పంపింది.

06/06/2018 - 05:21

హైదరాబాద్, జూన్ 5: స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ అనుబంధ విభాగం సేవాదళ్ పాత్ర మరువలేనిదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రాభవన్‌లో పీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గం, జిల్లా ముఖ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా ఏఐసీసీ సేవాదళ్ చీఫ్ లాల్‌జీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

06/06/2018 - 05:20

హైదరాబాద్, జూన్ 5: వరంగల్ జిల్లా మామునూరులో ప్రతిపాదించిన వెటర్నరీ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించామని, అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీ్ధర్‌ను కోరామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వెటర్నరీ కళాశాలకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించామని, బోధన సిబ్బంది 15 మంది ఉన్నారని, మరో 85 మంది నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు.

06/06/2018 - 05:19

న్యూఢిల్లీ, జూన్ 5: దేశవ్యాప్తంగా బాలికా విద్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ (కేబ్స్) ఇచ్చిన నివేదికలోని అంశాలను అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు.

06/06/2018 - 05:18

హైదరాబాద్, జూన్ 5: నరేంద్రమోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు చేరుతున్నాయని, కేంద్రప్రభుత్వ పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

06/06/2018 - 05:16

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన పత్తి ఉత్పత్తి (బీసీఐ)కి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ సొసైటీ (పీఆర్‌డీఐఎస్), ఎన్‌జీఐ సంస్థలు సంయుక్తంగా మంగళవారం ఇక్కడ ప్రత్యేక శిక్షణాశిబిరం ఏర్పాటు చేశాయి.

06/04/2018 - 04:09

బోధన్ (నిజామాబాద్) జూన్ 3: తెలంగాణ, మహారాష్టల్ర మధ్య ఉన్న మంజీరా నదిపై మహారాష్ట్ర కుట్రలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ఉన్న ఇసుక నిలువలు దోచుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో క్వారీల ఏర్పాటుకు మహా సర్కారు అడ్డగోలుగా అనుమతులు ఇస్తుండగా.. క్వారీలు దక్కించుకున్న వారు మరో అడుగు ముందుకేసి ఈ నది పూర్తిగా మహారాష్టక్రు సంబంధించినదే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

06/04/2018 - 04:04

జగిత్యాల, జూన్ 3: త్యాగాలు, బలిదానాలు, ఆశయాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా పండుగలు, ప్రచార ఆర్భాటాలతో సీఎం కేసీఆర్ నియంత.. రాచరిక పాలన కొనసాగిస్తున్నారని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Pages