S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/26/2015 - 07:51

హైదరాబాద్, నవంబర్ 25: గోదావరి జలాలు శుక్రవారం నగర ప్రవేశం చేయనున్నాయి. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌నుంచి ఇప్పటికే ఘన్‌పూర్‌కు చేరుకున్న 28 ఎంజిడిల నీటిని ప్రస్తుతమున్న నీటి సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేసే పనులు లింగంపల్లి రిజర్వాయర్ వద్ద ముగింపు దశకు చేరుకున్నాయి.

11/26/2015 - 07:49

హైదరాబాద్, నవంబర్ 25: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడు సహా ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మరొకరు పేర్వారం అల్లుడికి స్వయానా తమ్ముడి కొడుకు. ఈ దుర్ఘటనతో మాజీ డీజిపి ఇంట్లో విషాదం అలుముకుంది.

11/26/2015 - 06:05

హైదరాబాద్, నవంబర్ 25: వరంగల్ విజయం కొత్త చరిత్ర సృష్టించిందని అంటూనే, ఈ విజయం పార్టీ శ్రేణుల్లో గర్వం, అహంకారం పెంచకూడదని సిఎం కె చంద్రశేఖర్ రావు సూచించారు. ప్రజలతో అత్యంత వినయంగా, సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా ముఖ్య నేతలు బుధవారం సిఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు.

11/26/2015 - 06:04

హైదరాబాద్, నవంబర్ 25: వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లడిగేది లేదని తానిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని సిఎం కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రజలు కూడా పథకం కోసం ఎదురు చూస్తున్నారని సిఎం పేర్కొన్నారు.

11/26/2015 - 06:01

హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో రియల్ ఏస్టేట్ బూమ్ పడిపోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని నిరూపితమైంది. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా కోకాపేట, మణికొండ, రాయదుర్గం ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎకరం భూమి ధర రూ. 29.28 లక్షలు పలికింది.

11/25/2015 - 18:37

నల్గొండ: మల్కాపురంలో టిప్పర్‌ బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతువాతపడ్డారు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బొమ్మలరామారం మండలం నాయకునితండా వాసులుగా గుర్తించారు.

11/25/2015 - 13:21

మహబూబ్‌నగర్‌: వడ్డేపల్లి మండలం రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం నుంచి బుధవారం ఉదయం ఒక్కగేటు ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న 2600 క్యూసెక్కుల నీటితో ప్రస్తుతం జలాశంలో గరిష్టస్థాయి నీటిమట్టం నమోదైంది.

11/25/2015 - 11:38

నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల వద్ద నాగార్జునసాగర్ కాలువలో బుధవారం ఉదయం కార్తీక స్నానాలు చేసేందుకు వెళ్లిన మహేష్ అనే యువకుడు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇదే సంఘటనలో సూర్యాపేటకు చెందిన ఓ యువకుడిని స్థానికులు రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన మహేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

11/25/2015 - 11:37

హైదరాబాద్: రాజేంద్ర నగర్ మండలం కోకాపేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ఓ కారు పాల వ్యాన్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకరిని మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడిగా గుర్తించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు రాములు భార్య పేరున రిజిష్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు.

11/24/2015 - 13:57

వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీకి 6,15,403 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ పార్టీకి 1,56, 315 ఓట్లు అదేవిధంగా బీజేపీకి 1,30,178 ఓట్లు పోలయ్యాయి. గతంలోని సీఎం కేసీఆర్, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డును పసునూరి బ్రేక్ చేశారు. టీఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చుకున్నారు.

Pages