S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/03/2018 - 03:31

హైదరాబాద్, జూన్ 2: రాష్ట్రంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర నాలుగో అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పోలీసు శాఖను పూర్తిగా ఆధునీకరించామన్నారు. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తి కావచ్చిందని సీఎం తెలిపారు.

06/03/2018 - 03:30

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర నాలుగవ అవతరణ దినోత్సవ వేడుకలను పోలీ సు కార్యాలయాలు, జైళ్ళ శాఖలో శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణకు దోహదపడిన మహనీయులను స్మరించుకున్నారు. ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో అత్యంత వేడుకగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరక్టర్ సంతోష్ మెహ్రా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.

06/03/2018 - 03:28

హైదరాబాద్, జూన్ 2: నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ పాలన అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన మయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వరాష్ట్ర సాధనకు బలిదానాలు చేసిన అమరవీరులకు ఆయన జోహార్లు అర్పించారు.

06/03/2018 - 03:27

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు, స్కూళ్లలో రాష్ట్ర నాలుగో అవతరణ దినోత్సవ వేడుక పండుగ వాతావరణంలో జరిగింది. ఉన్నత విద్యామండలి , ఇంటర్మీడియట్ బోర్డు ఉస్మానియా యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీ, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీల్లో అధికారికంగా అవతరణ వేడుకల ను నిర్వహించారు.

06/03/2018 - 03:26

హైదరాబాద్, జూన్ 2: ఆర్టీసీ అభివృద్ధికి అంతా కంకణబద్ధులై పని చేయాలని టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా బస్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసి ఎండీ జివి రమణారావుతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

06/03/2018 - 03:25

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని కార్పొరేషన్ చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కార్పొరేషన్ ప్రధాన కార్యలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు.

06/03/2018 - 03:25

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు వినూత్న పథకాలతో ముందుకు వెళుతుంటే విపయ నేతలకు కన్పించడం లేదని, అందుకోసం ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు కళ్ళజోళ్ళు పంపిణీ చేయాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సూచించారు.

06/03/2018 - 03:23

హైదరాబాద్, జూన్ 2: ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుంభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు చాడ ముఖ్య అతిధిగా హాజరై కేసీఆర్ నాలుగేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

06/03/2018 - 03:22

హైదరాబాద్, జూన్ 2: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత గ్రామం చింతమడక నుంచి భారీగా యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నారై గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిద్దిపేట మండలం చింతమడక, రాఘవాపూర్, రావురుకుల ధర్మారం, కాళ్లకుంట కాలనీ, హనుమాన్ నగర్, ఇందిరమ్మ కాలనీ, భరత్‌నగర్‌ల నుంచి రూ.250 మంది యువత కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

06/03/2018 - 03:21

హైదరాబాద్, జూన్ 2: బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రుణాలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బీసీ భవన్‌లో బీసీ రుణాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 16 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా మాట్లాడారు.

Pages