S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/02/2018 - 03:01

హైదరాబాద్, జూన్ 1: రానున్న ఐదేళ్లలో సైబర్ సెక్యూరిటీ హబ్‌గా రూపాంతరం చెందనున్న తెలంగాణ రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. నాస్కామ్ చొరవతో తెలంగాణ ప్రభుత్వం ‘డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (డిఎస్‌సిఐ)) భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

06/02/2018 - 03:01

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖలో విశిష్ట సేవ లు అందించిన ముగ్గురు పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకాలు లభించాయి.

06/02/2018 - 03:00

హైదరాబాద్, జూన్ 1 నైరుతీ రుతుపవణాలు ఆగమనంతో జూన్ 5వ తేదీన తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజు లు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, అలాగే పిడుగులు పడే ప్రమాదాలు ఉన్నాయని, ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతల్లో చెట్లు, పాత గోడలు వద్ద ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

06/02/2018 - 02:59

హైదరాబాద్, జూన్ 1: వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా కాపాడుకోవడం, ప్రమాదాలు జరిగితే ఎలా రక్షించబడాలనే అంశంపై అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఒక్క రోజే పలు ప్రాంతాల్లో పలు రకాలైన పద్దతులను ప్రదర్శిస్తూ 98 ప్రచార కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలంగాణ అగ్నిమాపక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

06/02/2018 - 01:50

సిద్దిపేట, జూన్ 1: ‘లక్షలాది జీవితాల్లో వెలుగునింపేది మల్లన్నసాగర్ ప్రాజెక్టు.. మీ త్యాగాలు వెలకట్టలేం.. మీ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.

06/02/2018 - 01:41

హైదరాబాద్, జూన్ 1: అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి చూపిస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 2004లో అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సాధ్యం చేసి చూపించామని ఆయన శుక్రవారం విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనమైన రికార్డు తమదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కే.

06/02/2018 - 01:39

న్యూఢిల్లీ, జూన్ 1: దేశ రాజధానిలో అధికార కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ భవన్‌ను నిర్మించాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పొంగులేటి విలేఖరులతో మాట్లాడారు.

06/02/2018 - 01:38

హైదరాబాద్, జూన్ 1: అన్ని రకాల న్యాయాధికారులు, న్యాయమూర్తుల నియామకాల్లో జనాబా దమాషా ప్రకారం ఓబీసీలకు 54శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి విజ్ఞాన పత్రం అందించినట్టు సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు.

06/02/2018 - 01:38

హైదరాబాద్, జూన్ 1: ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తే సహించబోమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రటి ఎంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు వేతన బకాయిలు చెల్లించకుండా ఆ నిధులను భవనాల నిర్మాణాల కోసం మళ్లించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో గత సంవత్సరం పనిచేసిన 56లక్షల జాబ్‌కార్డుదారులకు రూ.

06/02/2018 - 01:37

హైదరాబాద్, జూన్ 1: రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై సమిష్టి పోరు నిర్వహించనున్నట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్, సీపీఎం కార్యదర్శి సభ్యులు డీజీ.నర్సింగరావు, ఎంసీపీఐ కార్యదర్శి తాండ్రకుమార్‌లతో కలిసి మాట్లాడారు.

Pages