S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/31/2018 - 06:02

హైదరాబాద్, మే 30: న్యాయవ్యవస్థలో పని చేసుస్తన్న న్యాయాధికారులకు తక్షణం ఉద్యోగి బేసిక్‌లో పెరిగిన 30 శాతం మధ్యంతర భృతిని 2018 మే నెల నుంచి (తాత్కాలిక) ఇవ్వాలని, అలాగే అరియర్స్ మాత్రం 2016 జనవరి నుంచి అమలు చేయాలని బుధవారం నాడు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

05/31/2018 - 06:01

హైదరాబాద్, మే 30 రైతాంగం నుంచి 35లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 33 లక్షల ధాన్యాన్ని సేకరించామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినప్పటికీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని ఆయ న చెప్పారు.

05/31/2018 - 06:01

హైదరాబాద్, మే 30: డిండి ఎత్తిపోతల పథకం ఫలాలను త్వరలో రైతులకు అందిస్తామని నీటిపారుదలశాఖ టి హరీశ్‌రావు ప్రకటించారు. కాలువల పనులు అక్టోబర్-నవంబర్ లోగా పూర్తి చేసి సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన గొట్టిముక్కల రిజర్వాయర్ ద్వారా తొలి ఫలాలు రైతులకు అందబోతున్నాయన్నారు. జలసౌధలో ఎత్తిపోతల పథకాల పురోగతిపై బుధవారం అధికారులతో మంత్రి సమీక్షించారు.

05/31/2018 - 06:00

హైదరాబాద్, మే 30: ఈ ఏడాది జూలైలో జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు అతి కీలకమైనవి. పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు. మిగిలిన ఎన్నికల కంటే భిన్నంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో జరుగుతాయి.

05/31/2018 - 05:59

హైదరాబాద్, మే 30: ఎమ్సెట్ ఇంజనీరింగ్ సర్ట్ఫికెట్ల పరిశీలనకు ఇంత వరకూ 25,370 మంది హాజరయ్యారు. 25వేల లోపు ర్యాంకర్లను పిలవగా, అం దులో 15557 మంది, 25,001 నుండి 40వేల ర్యాంకు వరకూ 9813 మంది మాత్రమే హాజరయ్యారు. వీరందరిలో ఇంత వరకూ 4584 మంది వెబ్ ఆప్షన్లను నమోదుచేశారు.

05/31/2018 - 05:57

హైదరాబాద్, మే 30: అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయణ రుణ మాఫీ చేస్తామని తమ పార్టీ ఇచ్చిన హామీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి ఆయన బుధవారం గాంధీ భవన్‌కు వచ్చారు.

05/31/2018 - 05:56

హైదరాబాద్, మే 30: వచ్చే జూన్ నాటికి హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. బేగంపేట మెట్రోరైలు భవన్‌లో బుధవారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిని మంత్రి సమీక్షించారు.

05/31/2018 - 05:53

హైదరాబాద్, మే 30: ప్రభు త్వ ఉద్యోగులతో పాటు తమకు వేతన సవరణ చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జెఏసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసి కార్మికులకు వేతన సవరణ ప్రకటించకుంటే సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ పిలుపునిచ్చింది.

05/30/2018 - 04:17

రామారెడ్డి, మే 29: రైతుకు బీమా సౌకర్యాన్ని కల్పించిన సీఎం కేసీఆర్.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పంట నష్టం విషయంలో రైతుకు భరోసా ఉంటుందని అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

05/30/2018 - 04:15

మహబూబ్‌నగర్, మే 29: దక్షిణాసియా ఖండంలోనే పాలమూరు ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు అని.. ఇలాంటి ప్రాజెక్టును వెనుకబడిన పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తుండడం ఇక్కడి ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Pages