S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/25/2018 - 02:31

హైదరాబాద్, మే 24: పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్‌లో గురువారం సాయంత్రం ఘనంగా ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

05/25/2018 - 02:26

హైదరాబాద్, మే 24: అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో అప్రజాస్వామిక పాలన రాజ్యమేలుతుందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన మహానాడులో పార్టీ అధ్యక్షులు ఎల్.రమ ణ, రేవురి ప్రకాష్ రెడ్డి, నర్సిరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, గందం గురుమూర్తి, అరవింద్, ఎంపీ గరికపాటి మోహన్‌రావు కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/25/2018 - 02:22

ఉద్యోగ రంగంలో వలస పాలకుల చేతుల్లో దగా పడిన తెలంగాణ, వివక్షత కోరల్లో చిక్కుకుని, శతాబ్దాల కాలం అన్యాయానికి గురి అయింది. దేశంలో మరే ప్రాంతంలోనూ చేయజాలని విధంగా ఈప్రాంతీయులు చేసిన సుదీర్ఘ ఉద్యమాలు, పోరాటాలు, తెలంగాణ వాసుల నిలువు దోపిడీని ఆపలేకపోయాయి.

05/25/2018 - 02:21

రాజేంద్రనగర్, మే 24: తెలంగాణలో రైతులకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం రాజేంద్రనగర్‌లోని ఆడిటోరియం సమీపంలో ఏర్పాటుచేసిన విత్తనమేళా-2018ని ఆయన ప్రారంభించారు. కొంత మంది రైతులకు ఈ సందర్భంగా ఆయన విత్తన బస్తాలను అందించారు.

05/25/2018 - 02:21

హైదరాబాద్, మే 24: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ మృతి పట్ల అనేకమంది నేతలు స్వయంగా వచ్చి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలుపుతూ త్వరగా కోలుకునే శక్తిని ఆ భగవంతుడు దత్తాత్రేయ దంపతులకు ఇవ్వాలని కోరుతున్నారు. గురువారం నాడు ప్రధాని ఒక ప్రత్యేక లేఖను దత్తాత్రేయకు పంపించారు. వైష్ణవ్ మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

05/25/2018 - 02:20

హైదరాబాద్, మే 24: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను జూన్ 10లోగా ప్రకటిస్తామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

05/25/2018 - 02:19

హైదరాబాద్, మే 24: తెలంగాణలోని గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల మేఘాలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (స్టేట్ ఎలక్షన్ కమిషన్-ఎస్‌ఈసీ) ఇప్పటికే గ్రామాల్లో వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాలను ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి సూచనలు, సలహాల మేరకు తుది ఓటర్ల జాబితాలు రూపొందించారు.

05/25/2018 - 02:17

హైదరాబాద్, మే 24: తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన మహానాడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన మోత్కుపల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య దూరం గా ఉన్నారు. మరో సంవత్సరంలో ఎన్నికలు ఉండగా టీటీడీపీ 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు మరో రెండుచోట్ల మినీ మహానాడులు నిర్వహించి రాష్టస్థ్రాయి మహానాడును ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించింది.

05/24/2018 - 04:16

యాదగిరిగుట్ట, మే 23: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పునః నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, యాదాద్రి తెలంగాణలో మరో తిరుపతిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని దేవాదాయశాఖ మంత్రి కె. ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

05/24/2018 - 04:15

హైదరాబాద్, మే 23: కోటి ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం చేయడంలో ఇంజనీర్లు భాగస్వామ్యం కావాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నీటిపారుదలశాఖలో 300 మంది సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు మంత్రి బుధవారం నియామక పత్రాలను అందజేసారు.

Pages