S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/22/2018 - 05:14

హైదరాబాద్, మే 21: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో తొలగించిన కోర్సులు అన్నింటినీ చేర్చాలని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ కోరింది. కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే చక్రధరరావు, నిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ జి హరగోపాల్ తదితరులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని కోరారు.

05/22/2018 - 05:13

హైదరాబాద్, మే 21: ఆర్టీసిపై అధికంగా భారం పడడానికి కారణం ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులేనని టిఎస్‌ఆర్టీసి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) స్పష్టం చేసింది. ఆర్టీసి బస్‌లు సగటున రోజుకి 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయని తెలిపింది. అన్ని రకాల పన్నులు కలిపి కిలోమీటర్‌కు రూ.5 చొప్పున అంటే రోజుకు రూ.1.80 కోట్లు పన్నుల రూపేణా ఆర్టీసి చెల్లిస్తోందని తెలిపింది.

05/22/2018 - 04:59

హైదరాబాద్, మే 21: మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం రాజీవ్ 27వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించారు. సోమాజీగుడాలోని రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూల దండలువేసి నివాళి అర్పించారు.

05/22/2018 - 04:58

హైదరాబాద్, మే 21: ప్రభుత్వ అధికారులు ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపు ఇచ్చారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డులను సోమవారం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) లో ప్రదానం చేశారు.

05/22/2018 - 04:56

హైదరాబాద్, మే 21: ఇటీవల వెలువడిన సివిల్స్ పరీక్షల్లో టాపర్స్‌గా నిలిచిన వారిని శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు అభినందించారు. సోమవారం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ టాపర్స్‌తో ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్దం అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య హాజరై స్వామిగౌడ్, మధుసూదాన చారిలు వారిని సన్మానించారు.

05/22/2018 - 04:54

హైదరాబాద్, మే 21: అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై అటవీ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. పట్టణీకరణ, వివిధ కారణాలతో అంతరించి పోతున్న అటవీ సంపద అగ్నిప్రమాదాల కారణంగా విలువైన వన సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. మండు వేసవిలో అడవుల్లో చిన్నపాటి నిప్పు రవ్వలతో మొదలౌతున్న మంటలు క్షణాల్లో పూర్తిగా వ్యాపించి అడవిని దహించి వేస్తున్నాయి.

05/22/2018 - 04:49

హైదరాబాద్, మే 21: గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు నిర్వహించిన రిక్రూట్‌మెంట్ రాతపరీక్షలో 67 ప్రశ్నలను తొలగించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణయించింది. ప్రిన్సిపాల్ పోస్టులకు పరీక్ష నిర్వహించిన వెంటనే ఆ పేపర్ లీక్ అయిందనే వార్తలు వచ్చాయి. దానిపై పరిశీలించిన అధికారులు ఒక ప్రైవేటు బ్లాగ్‌లోని ప్రశ్నలు యథాతథంగా వచ్చాయని గుర్తించారు.

05/22/2018 - 04:47

* రాచకొండ పోలీసులకు చిక్కిన ఇద్దరు మయన్మార్ దేశస్థులు
* నలుగురిని అరెస్టు చేసిన బాలాపూర్ పోలీసులు

05/22/2018 - 04:45

హైదరాబాద్, మే 21: కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఐసెట్‌ను ఈ నెల 23,24 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. దీనికి 61,439 మంది దరఖాస్తు చేశారు. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం సుబ్రమణ్య శర్మ తెలిపారు.

05/22/2018 - 04:44

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర వ్యాయామ కళాశాలల్లో బి.పి.ఇడి, డి.పి.ఇడి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన టిఎస్‌పిఇసెట్-2018 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణలు విడుదల చేశారు.

Pages