S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/20/2018 - 03:36

నిజామాబాద్, మే 19: ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సత్వరమే బిల్లుల చెల్లింపులు జరిగేలా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు చొరవ చూపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

05/20/2018 - 03:33

సూర్యాపేట, మే 19: దేశంలో నేడు జాతీయ రాజకీయాలన్నీ కుళ్లి కంపుకొడుతున్నాయని ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం లౌకిక ప్రజాతంత్ర వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

05/20/2018 - 03:28

హైదరాబాద్, మే 19: రోగులను ఎక్కువ సమయం వేచి ఉంచవద్దని టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ తార్నాక ఆర్టీసి హాస్పిటల్ అధికారులను ఆదేశించారు. మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే అదనపు కౌంటర్లు ప్రారంభించాలని చెప్పా రు. శనివారం చైర్మన్ సత్యనారాయణ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రోగులు, హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడారు.

05/20/2018 - 04:28

హైదరాబాద్ సాంప్రదాయ ఇసుకకు బదులుగా కృత్తిమ ఇసుకను తయారు చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని గనులు భూగ్భగనుల శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. వడ్డెర సొసైటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ యువకులకు కృత్తిమ ఇసుక ప్లాంట్లను ( మ్యాన్యుపాక్చర్ సాండ్) ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరిసుస్తందని ఆయన తెలిపారు. శనివారం నాడు సచివాలయంలో మంత్రి తమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

05/20/2018 - 03:21

హైదరాబాద్, మే 19: 2018 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డుల కోసం ఐఏఎస్, ఇతర అధికారులను ఎంపిక చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెర్చ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు అవార్డులు ఇచ్చేందుకు అధికారులను ఎంపిక చేశామన్నారు.

05/20/2018 - 03:19

హైదరాబాద్, మే 19 తెలంగాణాలో కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో గడ్డురోజులని ఎంపి బాల్క సుమ న్ జోస్యం చెప్పారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా ఎక్కడా నిశబ్ధ విప్లవం లేదని, దేశ వ్యాప్తంగా కెసిఆర్ విప్లవం నడస్తున్నదని ఆయన కొనియాడారు. రైతు అభ్యున్నతికే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అందుకే తెలంగాణాలో పండుగు చేసుకుంటున్నారని చెప్పారు.

05/20/2018 - 03:18

ఆర్మూర్, మే 19: నిజామా బాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన సామల శ్రీ ఆర్యన్ మెడిసిన్‌లో 3వ ర్యాంకు సాధించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఎంసె ట్ ఫలితాలను విడుదల చేసిం ది. ఇందులో శ్రీ ఆర్యన్ మెడిసిన్ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు.

05/20/2018 - 03:15

హైదరాబాద్, మే 19: డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా కేంద్రీకృత పద్ధతిలో ప్రభుత్వమే ఇంటర్ మీడియట్ అడ్మిషన్లను నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బీసీ భవన్‌లో నిర్వహించిన బీసీ విద్యార్ధి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

05/20/2018 - 03:12

హైదరాబాద్, మే 19: రాష్ట్రంలో అత్యధిక ప్రసవా లు జరుగుతున్న ప్లేట్ల బురుజు ఆసుపత్రిలో త్వరలో ఇన్ ఫర్టిలిటి సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆయన వరాల జల్లు కురిపించారు. దేశంలో మొట్టమొదటి సారిగా గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇన్‌ఫెర్టిలిటి సెంటర్‌కు విశేష స్పందన ఉందని అన్నారు.

05/19/2018 - 04:35

వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10 నుండి పండుగ వాతావరణంలో ప్రారంభమైన రైతు బంధు పథకం ఎలాంటి అపశ్రుతి లేకుండా, సజావుగా ముగిసిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు బంధు పథకం ముగింపు సందర్భంగా శుక్రవారం వరంగల్ నగరంలోని హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రైతు బంధు పథకం సాగిందని అన్నారు.

Pages