S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/11/2018 - 03:37

హైదరాబాద్, ఏప్రిల్ 10: రాష్ట్రంలోని పత్తి రైతులను నకిలీ పత్తి విత్తనాలు, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాల ఉత్పత్తిదారుల నుంచి రక్షించడం కోసం ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై కూలంకుషంగా చర్చించారు.

04/11/2018 - 03:35

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రూపొందించిన వివిధ పథకాల ద్వారా సాయం కోసం ఎదరు చూస్తున్న బ్రాహ్మణులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ పరిషత్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ (బొగ్గులకుంట) లోని ధార్మిక భవన్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

04/11/2018 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 10: కొత్త పెన్షన్ విధానం నుంచి వైదొలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో సమావేశమైంది.

04/11/2018 - 04:05

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 9 కమిటీలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నియమించారు. ఈ కమిటీల్లో ప్లీనరీకి వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీ బాధ్యతలను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపి మల్లారెడ్డికి అప్పగించారు. ఇతర కమిటీలకూ బాధ్యులను నియమించారు.

04/11/2018 - 03:28

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన మూడో దశ కాంగ్రెస్ బస్సు యాత్ర ఈ నెల 15న ఖమ్మం నుంచి తిరిగి ప్రారంభంకానుంది. గత నెలలో చేవేళ్ళ నుంచి బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకావడంతో బస్సు యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసి, తాజాగా మలి విడత నిర్వహించారు.

04/11/2018 - 03:27

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ జైళ్ల శాఖ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ జైళ్ల నిర్వహణపై దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జైళ్ల శాఖను కోరింది.

04/11/2018 - 03:27

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కార్యాలయంలో పనిచేసేందుకు మొదటిదశలో కొంత మంది సిబ్బందిని కేటాయించారు.

04/11/2018 - 03:26

హైదరాబాద్, ఏప్రిల్ 10: మున్సిపల్ కార్మికుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పెంచాలని టీన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచేందుకు జీవో జారీ చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్ల వేతనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

04/11/2018 - 03:25

హైదరాబాద్, ఏప్రిల్ 10: మేడే సందర్భంగా అందించనున్న శ్రమ శక్తి, బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా రంగారెడ్డి జోన్ కార్మికశాఖ జాయింట్ డైరెక్టర్ ఓ ప్రకనలో పేర్కొన్నారు. కార్మిక రంగంలో అద్బుతమైన కృషి చేసిన వ్యక్తులు, బెస్ట్ మెనేజ్‌మెంట్ అవార్డులను అందించనున్నట్టు వివరించారు.

04/11/2018 - 03:25

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణలో ఎనిమిది స్థానికసంస్థలు ఉత్తమ పంచాయతీ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందచేస్తారు. కేంద్రం ఏటా ఇచ్చే అవార్డుల్లో భాగంగా సశక్తి కరణ్ పురస్కార్‌ను ఆదిలాబాద్ జిల్లాపరిత్‌కు, సిద్ధిపేట మండలపరిషత్‌తో పాటు పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్ మండలపరిషత్‌లు ఎంపికయ్యాయి.

Pages