S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/11/2018 - 03:24

హైదరాబాద్, ఏప్రిల్ 10: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో, మహిళా డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకూ పొడిగించినట్టు కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 26న నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

04/11/2018 - 03:23

హైదరాబాద్, ఏప్రిల్ 10: వ్యవసాయంలో లాభాలు రాకపోవడానికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులతో ఓ యువ రైతు ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే... సూర్యపేట జిల్లాకు చెందిన లీలావతి, ఉప్పలయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సైదులు (24) ఉన్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ సైదులు వ్యవసాయం చేస్తున్నాడు.

04/11/2018 - 00:38

మహబూబాబాద్, ఏప్రిల్ 10: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తుత్తి మాటలు చెబుతూ బస్సుయాత్ర చేస్తున్నారని ప్రజలెవరూ ఈ యాత్రలను పట్టించుకోవడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మానుకోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరుపట్ల మండిపడ్డారు.

04/11/2018 - 04:07

మిర్యాలగూడ: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు దోచుకుంటున్నారు. మట్టిబిడ్డలను మాయచేసి తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రబీ సీజన్ ఆరంభంలో అధికంగా ధరలు ఉన్నట్లు ఆశ చూపించి ధాన్యంను ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తున్న సమయంలో మిల్లర్లు సిండికేట్లుగా మారి ధరలను భారీగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

04/11/2018 - 00:27

స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ తన అధికార పబ్బాన్ని గడుపుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మండల బీజేపీ ఆధ్వర్యంలో దళిత అదాలత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

04/11/2018 - 00:24

హైదరాబాద్, ఏప్రిల్ 10: బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్‌పై జరిగిన దాడిపై విచారణ జరిపి హిందూ నేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్న మతోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హిందూ జనజాగృతి సమితి సమన్వయకర్త చేతన్‌గాడి డిమాండ్ చేశారు.

04/11/2018 - 00:23

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10: మిషన్‌భగీరథ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని అనుకున్న సమయానికి ముందుగానే తాగునీరు అందించనున్నామని మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

04/11/2018 - 00:21

తలమడుగు, ఏప్రిల్ 10: కుల వృత్తులను ప్రోత్సహించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, పశుగ్రాసం కొరత రాకుండా ఇక అడవుల్లో గడ్డి పెంపకం చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

04/11/2018 - 00:19

సిద్దిపేట, ఏప్రిల్ 10 : బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పెద్దఎత్తున కుంభకోణాలు పెరిగాయని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారని.. మోదీ సర్కార్ గద్దెనెక్కగానే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందని విమర్శించారు.

04/11/2018 - 00:16

ఆదిలాబాద్, ఏప్రిల్ 10: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం గ్రామ చెరువులో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం జరిపిన సంఘటనలో ఏడు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. గత జూలై మాసంలో ఉండం చెరువులో మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం 2.5 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టగా అవి వృద్ధి చెంది విక్రయానికి సిద్ధంగా ఉన్న దశలోనే విష ప్రయోగం జరపడం అలజడి రేపింది. ఈ ఘటన గ్రామస్థులు జరిపారా?

Pages