S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/10/2018 - 02:01

దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా దీక్ష నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం గాంధీభవన్ ఆవరణలో దీక్షలో కూర్చున్న షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్యయ్య

04/10/2018 - 01:57

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ (బొగ్గులకుంట) లోని ధార్మికభవన్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని పరిషత్ అడ్మినిస్ట్రేటర్ యు. రఘురాం శర్మ తెలిపారు. పరిషత్ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించామని ఆయన వివరించారు.

04/10/2018 - 01:57

హైదరాబాద్, ఏప్రిల్ 9: రాష్ట్ర పోలీస్ రెగ్యులర్ డీజీపీగా ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. డీజీపీ నియామకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణాయనుసారమే జరిగే విధంగా ఇటీవల శాసనసభలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

04/10/2018 - 01:56

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రత్యక్ష అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనివ్వడం హర్షణీయమని ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్‌ఏ) చైర్మన్ వివేక్ అన్నారు. ప్రత్యక్షంగా విక్రయాలు జరుపుకునే వారి హక్కులను రక్షించేలా నియమనిబంధనలను రూపొందించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిక్కీ, ఐడీఎస్‌ఏ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

04/10/2018 - 01:53

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ పిఇసెట్‌కు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10వ తేదీ నుండి 20వ తేదీ వరకూ పొడిగించారు. 500 జరిమానాతో ఏప్రిల్ 27 వరకూ, 2వేల జరిమానాతో 30వ తేదీ వరకూ, 5వేల జరిమానాతో మే 4వ తేదీ వరకూ గడువు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు.

04/09/2018 - 02:25

హైదరాబాద్, ఏప్రిల్ 8: మూత్ర సంబంధిత వ్యాధులకు సంబంధించి చికిత్సకోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 40 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు 20 ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల డయాలసిస్ కేంద్రాలను దశలవారీగా ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సోమవారం నుండి ఐదుజిల్లాల్లో పర్యటిస్తున్నారు.

04/09/2018 - 02:24

జహీరాబాద్, ఏప్రిల్ 8: ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెంది న ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడటంతో సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో జబరున్నీసా బేగం (47) ఆమె కుమారుడు శాకీర్ (27)లు న్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ప్రార్థన చేసుకునేందుకు జబరున్నీసా సిద్ధమైంది.

04/09/2018 - 02:21

హైదరాబాద్, ఏప్రిల్ 8: సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిబా పూలే చూపిన మార్గంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈనెల 11న నిర్వహించనున్న పూలే జయంతి వేడుకల పోస్టర్‌ను ఎంబీసీ చైర్మన్ తడూరి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం సాయి కిరణ్‌లతోకలిసి ఆవిష్కరించారు.

04/09/2018 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 8: పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రజాస్వామ్యం గొంతు నొక్కాయని బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటును వేదికగా చేసుకోవడం బాధాకరమని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, మరి కొన్ని పార్టీలు ఓబీసీ బిల్లును అడ్డుకున్నాయని ఆయన విమర్శించారు.

04/09/2018 - 02:18

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్రంలో గిరిజనుల జీవితాల రూపురేఖలు మార్చడంలో గిరిజన ఇసుక సొసైటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన ఇసుక సొసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు ప్రభుత్వం చేపట్టిందని గనులశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సొసైటీల్లో భాగస్వాములుగా ఉన్న పది వేల కుటుంబాలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తున్నాయి.

Pages