S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/07/2018 - 02:29

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన అన్ని డిపోలు ఆర్థికంగా పుంజుకునేలా చూడాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సూచించారు. సంస్థ నూతన ఈడీగా బాధ్యతలు స్వీకరించిన కొమురయ్య చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ స్థితిగతులపై చర్చించారు. సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి సాధ్యం అవుతుందని, ప్రయాణికుల అవసరాలను గుర్తించి ఈ మేరకు సేవలను అందించాలన్నారు.

04/06/2018 - 03:48

కరీంనగర్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, రాష్ట్రంలో 41లక్షల మంది పేదలకు రూ.వెయ్య చొప్పున ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

04/06/2018 - 02:29

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5: మహబూబ్‌నగర్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నాలుగైదు రోజుల నుండి తరచూ జిల్లాలోదో ఒకచోట పిడుగులతో కూడిన వడగళ్లవాన కురుస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోతుంది. భారీ గాలులు సుడిగాలుల్లా వీస్తూ ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి.

04/06/2018 - 02:27

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5: పాలమూరు ప్రజలకు, రైతాంగానికి సాగు, తాగునీరు వచ్చేసిందని మరో రెండేళ్లలో నూటికినూరుశాతం ప్రతి ఎకరాకు కృష్ణాజలాలు అందించి పాలమూరు రైతుల పాదాలు కడుగుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం ఆయన పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు.

04/06/2018 - 02:24

వరంగల్, ఏప్రిల్ 5: చావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, చంపే ధైర్యం మీకుందా అంటూ సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనను చంపినట్టయితే ముఖ్యమంత్రి పీఠం వదలిపెట్టి పారిపోయే రోజులు వస్తాయని అన్నారు.

04/06/2018 - 02:21

హైదరాబాద్, ఏప్రిల్ 5: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు పార్టీలూ ఒకే గూటి పక్షులని, రెండు పార్టీలూ అవినీతి, అక్రమాల్లో మునిగితేలాయని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

04/06/2018 - 02:17

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రాథమిక దశే విద్యార్థులకు కీలకమని టిఎస్‌ఆర్టీసి ట్రాన్స్‌పోర్టు అకాడమి ప్రిన్సిపాల్ జిఆర్ కిరణ్ అన్నారు. చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తగిన నిరంతర సాధన, తపన ఉండాలని అన్నారు. గురువారం నాడిక్కడ బంజారాహిల్స్‌లోని పేజ్ కాలేజీ నిర్వహణలో 15 రోజుల పాటు జరిగే ‘విద్యా అనే్వషణ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

04/06/2018 - 02:15

హైదరాబాద్, ఏప్రిల్ 5: కుల వృత్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కుమ్మరి కులస్థులకు ఆధునిక యాంత్రాలతో మట్టి పాత్రలు, విగ్రహాలు తయారు చేసే అంశంపై శిక్షణ ఇవ్వనుంది. మంత్రి జోగు రామన్న గురువారం గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి అక్కడి సోషియల్ జస్టిస్ మంత్రి ఈశ్వర్ భాయ్ పర్మర్‌తో భేటీ అయ్యారు.

04/06/2018 - 02:11

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, రూ. 37,938 కోట్ల పెట్టుబడులతో వీటిని చేపట్టామని తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటించారు. మణుగూరులో 5880 మెగావాట్ల ప్రాజెక్టు, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, దామరచర్లలో 4000 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పనులు ఊపందుకున్నాయన్నారు.

04/06/2018 - 02:09

హైదరాబాద్, ఏప్రిల్ 5: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడిన బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు గురువారం రాష్టవ్య్రాప్తంగా ఘనంగా నిర్వహించారు.

Pages