S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/06/2018 - 00:21

హైదరాబాద్, ఏప్రిల్ 5: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలపై ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉండటం తీవ్ర బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యంగా ఎన్‌డీఏ అధికారంలోకి చవ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

04/06/2018 - 00:21

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రగతి భవన్ గడీని బద్దలు కొడదాతామని కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ తీవ్రంగా మండిపడింది. ప్రగతి భవన్ గడీ కాదు, అది ప్రజల భవన్, కోదండరామ్ వెనక ఎవరు ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలను మాట్లాడిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ మండిపడ్డారు.

04/06/2018 - 00:20

హైదరాబాద్, ఏప్రిల్ 5: దేశంలో సహిత విద్య అమలులో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని దివ్యాంగుల విద్యాభివృద్ధి జాతీయ కమిటీ కన్వీనర్ కల్పగిరి శ్రీను ఆరోపించారు. ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగులైన పిల్లల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పోవాలని, ఇప్పటికైనా వారి అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని ఆయన కోరారు.

04/06/2018 - 03:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పన్నుల వసూలులో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించి రికార్డు సృష్టించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ రూ. 39,544 కోట్లు, ఎక్సైజ్ శాఖ రూ.9400 కోట్లు కలిపి రూ. 48,944 కోట్ల పన్నులను వసూలు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 20.02 మేర వృద్ధిరేటును సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో వాణిజ్య పన్నుల శాఖ రూ. 53,939 కోట్లు, ఎక్సైజ్ శాఖ రూ.

04/06/2018 - 00:19

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను గద్దెదించేందుకు లోకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులను కలుపుకొని విశాల ఐక్య వేదికను ఏర్పాటు చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర మహాసభల అనంతరం మొదటిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చాడ మాట్లాడారు.

04/05/2018 - 05:03

మహబూబాబాద్, ఏప్రిల్ 4: అధికారంలో ఉండగా ప్రజల ఆకాంక్షల గురించి, అవసరాల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంక్రాంతి పోయాక వచ్చిన గంగిరెద్దుల వేషగాళ్ల మాదిరిగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మానుకోట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు బుధవారం ఆయన హాజరయ్యారు.

04/05/2018 - 05:02

నిర్మల్, ఏప్రిల్ 4: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను వచ్చే మార్చి నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీనిచ్చారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను బుధవారం మంత్రి ప్రారంభించారు.

04/05/2018 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2,22,393 కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది జనవరి నాటికి 2,42,057 కేసులు పెండింగ్‌లో ఉండగా, 1,29,725 కేసులను పరిష్కరించారు. ఇందులో 3,497 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. 31,753 కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న వారు విడుదలయ్యారు. వివిధ కారణాల వల్ల 94,475 కేసులు పరిష్కారమయ్యాయి.

04/05/2018 - 04:58

ఖమ్మం, ఏప్రిల్ 4: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతుల ఆక్రందనలు ఎక్కువయ్యాయని సీఎల్‌పీ నాయకుడు కే జానారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో అకాలవర్షం, పెనుగాలులకు దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప, వరి పంటలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎంఎల్‌సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలిసి జానారెడ్డి బుధవారం పరిశీలించారు.

04/05/2018 - 04:57

హైదరాబాద్, ఏప్రిల్ 4: భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈనెల1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభతో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఒక రోజు మహాసభతో పాటు మూడు రోజుల పాటు ప్రతినిధుల సభ జరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Pages