S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/04/2018 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 3: భారత్ బంద్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై బిజెపి,కాంగ్రెస్‌లు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. దళితులను వేధించిన సంఘటనలపై దేశంలో సాలీనా 45 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే దానికి కాంగ్రెస్, బీజేపీలదే బాధ్యతన్నారు.

04/04/2018 - 02:30

హైదరాబాద్, ఏప్రిల్ 3: తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడిటేషన్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తప్పుపట్టారు. పౌరుల హక్కులను భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

04/04/2018 - 02:28

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ రాష్ట్రంలో 18675 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్, 2985.67 ఎంయు జల విద్యుత్ అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పేర్కొంది. డిస్కాంలు సమర్పించిన గణాంక వివరాలను విశే్లషించిన తర్వాత ఈ మేరకు విద్యుత్‌కు మండలి ఆమోదించి వివరాలను వెల్లడించింది.

04/04/2018 - 02:28

హైదరాబాద్, ఏప్రిల్ 3: రూఫ్ గార్డెన్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ప్రజలంతా పూర్తిగా వినియోగించుకోవాలని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకటరామిరెడ్డి కోరారు. ఉద్యాన శాఖ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాజధానిలో 40 లక్షల ఇళ్లు ఉంటే ఆరువేల మంది మాత్రమే భవనాలపై కూరగాయలు సాగు చేస్తున్నారన్నారు.

04/04/2018 - 02:27

హైదరాబాద్, ఏప్రిల్ 3: తమిళనాడుకు మూడు లక్షల టన్నుల బియ్యం (బాయిల్డ్‌రైస్) పంపిస్తున్నామని పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ధాన్యం కొనుగోలు తదితర అంశాలను వివరించారు. క్వింటాల్ బాయిల్డ్‌రైస్ గ్రేడ్ ‘ఏ’ రకానికి 2670 రూపాయలు, సాధారణ రకానికి 2610 రూపాయలకు విక్రయిస్తున్నామని మంత్రి తెలిపారు.

04/04/2018 - 02:24

హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఘన చరిత్ర ఏమిటో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెప్పానని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వి హనుమంత రావు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ఎలా వంచిస్తున్నారో, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడం గురించి వివరంగా చెప్పానని విహెచ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

04/04/2018 - 02:23

హైదరాబాద్, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం (1989)లోని కీలక నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీ.టీడీపీ నాయకుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

04/04/2018 - 02:22

హైదరాబాద్, ఏప్రిల్ 3: రైతుబంధు పథకం కింద రైతులకు అందచేయాల్సిన ఆర్థిక సాయం కోసం రైతుల పేర్లతో కూడిన రెండోదశ జాబితాను ప్రభుత్వం మంగళవారం బ్యాంకర్లకు అందచేసింది. రెండో దశలో 4453 గ్రామాలకు సంబంధించిన 25.14 లక్షల మంది రైతుల పేర్లతో ఉన్న డేటాను బ్యాంకర్లకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి అందచేశారు. తొలిదశలో మూడు రోజుల క్రితం 3302 గ్రామాలకు చెందిన 16.36 లక్షల మంది రైతుల డేటాను అందించారు.

04/04/2018 - 02:21

హైదరాబాద్, ఏప్రిల్ 3: పెట్టుబడిదారులకు లబ్ధిచేకూర్చడం కోసమే దేశంలో బీజేపీ పాలన కొనసాగిస్తోందని సీపీఐ కార్యదర్శి కామ్రెడ్ అతుల్‌కుమార్ అంజన్ దుయ్యబట్టారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఆయన ప్రసంగించారు. హిట్లర్ ఆలోచన విధానంతో మోదీ పాలన చేస్తున్నారని, వారి ఆగడాలను ప్రశ్నించిన వారిని అణిచి వేస్తూ అధికారంలో కొనసాగాలని చూస్తున్నారని అన్నారు.

04/04/2018 - 02:21

హైదరాబాద్, ఏప్రిల్ 3: దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్న విదేశీ సిగరెట్లపై దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గుజరాత్‌రాష్ట్రాలకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ అసోసియేషన్స్ (ఫైఫా) కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఫైఫా ప్రధాన కార్యదర్శి మురళి బాబు ప్రకటన విడుదల చేశారు.

Pages