S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/20/2018 - 19:14

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు వివిధ రకాలైన భంగిమలతో ప్రత్యర్థిని భయపెట్టే ప్రయత్నం చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని అతని గట్టి నమ్మకం. అదే విధంగా ప్రతి పాయింట్ తర్వాత అతను టవల్‌తో చేతులు తుడుచుకుంటాడు. మంచినీటి బాటిల్‌కు ఉండే లేబుల్ ఖచ్చితంగా కోర్టు చివరి లైన్‌పైపు ఉండేలా చూసుకుంటాడు.

01/20/2018 - 19:12

క్రీడా పోటీలు యుద్ధాన్ని తలపిస్తాయి... నిజమే.. కానీ, యుద్ధాలతో క్రీడలకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. అయితే, లండన్‌లోని ట్వికెన్‌హామ్ స్టేడియంలో సుమోవా రగ్బీ జట్టు వార్ డాన్స్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరుస పరాజయాలతో అల్లాడుతున్న ఈ జట్టు ఆటగాళ్లలో పౌరుషాన్ని నింపాలంటే, రొటీన్ ఎక్సర్‌సైజ్ సరిపోదని నిర్ణయానికి వచ్చిన అధికారులు వార్ డాన్స్ చేసి తీరాలని ఆదేశించారు.

01/20/2018 - 19:09

* టీనేజర్ జార్జి రసెల్ కష్టాలు అన్నీ ఇన్నీకావు. బ్రిటన్ నుంచి దుబాయ్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఉక్కబోతకు 19 ఏళ్ల జార్జి తట్టుకోలేకపోయాడు. ఫార్ములా వన్ రేసు కోసం అక్కడికి చేరిన మిగతా డ్రైవర్లంతా ఐస్ క్రీములు తింటూ, చాక్లెట్లు నములుతూ ఉష్ణ తాపం నుంచి బయటపడితే, జార్జి మాత్రం వాటికి దూరంగా ఉండక తప్పలేదు. అతని భారీ విగ్రహమే అందుకు కారణం.

01/20/2018 - 19:07

* సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో పీలే ఒకడు. అతనిని చూసేందుకు అభిమానులు స్టేడియాలకు వెల్లువెత్తేవాళ్లు. అతని ఆటోగ్రాఫ్ లభిస్తే, అంతకంటే మహాభాగ్యం లేదని పొంగిపోయేవాళ్లు. ఇక అతనితో ఫొటో దిగే అవకాశమే వస్తే, వారి ఆనందానికి అంతే ఉండేది కాదు. అలాంటి పీలే స్వయంగా ఇచ్చిన షర్టును ఓ అభిమాని వెనక్కు ఇచ్చేశాడట.

01/20/2018 - 19:06

* బ్రిటిష్ ప్రొఫెషనల్ స్నూకర్ ఆటగాడు, మాజీ ప్రపంచ చాంపియన్‌కు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మండిపడుతున్న వారంతా ఈ స్నూకర్ ఆటగాడిని కసితీరా తిడుతున్నారట. ఇదెక్కడి గొడవ అంటూ వాపోతున్నాడు ఆ మాజీ చాంపియన్. అసలు విషయం ఏమిటంటే, అతని పూర్తి పేరు జూడ్ ట్రంప్.

01/20/2018 - 19:04

* ఇంగ్లీష్ కౌంటీ గ్లూసెస్టర్‌షైర్‌కు కెప్టెన్‌గా సేవలు అందించిన జాక్ క్రాప్ ఒక మ్యాచ్‌లో సెంచరీకి చేరువైనప్పటికీ, దురదృష్టం వెంటాడడంతో ఆ మైలురాయిని చేరలేకపోయాడు. గ్లూస్టెర్‌షైర్ ఏడు వికెట్లకు 231 పరుగులు చేసినప్పుడు క్రాప్ 99 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

01/13/2018 - 18:28

ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు. రకరకాలైన విశ్వాసాలు, మూఢ నమ్మకాలు కేవలం సామాన్యులకే పరిమితం అనుకుంటే పొరపాటే. సెలబ్రిటీలకు ఇది మరీ ఎక్కువ. మన దేశంలో క్రికెట్ ఒక మతంలా వెలిగిపోతున్నది. క్రికెటర్లను సాక్షాత్తు దేవతలుగా ఆరాధించే వారికి కొదువ లేదు. అందుకే క్రికెటర్లకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిని రేపుతుంది. వారికి ఉన్న నమ్మకాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఎంతోకొంత ఉంటుంది.

01/13/2018 - 18:27

‘క్రికెట్ దేవుడు’ సచిన్ తెండూల్కర్ బ్యాటింగ్‌కు దిగే ప్రతిసారీ ముందుగా ఎడమ కాలి ప్యాడ్‌ను కట్టుకునేవాడు. ఒక్కోసారి హడావుడిగా మైదానంలోకి వెళ్లాల్సి వచ్చినా, తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నడూ అతను ముందు కుడి కాలి ప్యాడ్ కట్టుకోలేదు. ఏ కాలికి ముందు ప్యాడ్ కట్టుకుంటే ఏమవుతుంది? అనే ప్రశ్నకు సచిన్ వద్ద కూడా సరైన సమాధానం లేదేమో!

01/13/2018 - 18:25

హేమాహేమీ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ను నిలువరించి, 1983లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత్‌కు సాధించి పెట్టిన లెజెండరీ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరుమీద చాలా రికార్డులున్నాయి. వాటిలో ఒకటి కెప్టెన్‌గా అతని అద్భుత బౌలింగ్.

01/13/2018 - 18:24

‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో భారత జట్టు టెస్టు మ్యాచ్‌ని గెల్చుకున్న రెండు సంఘటనల మధ్య సారూప్యం కాకతాళీయమేనా? లేక చాలా మంది క్రికెటర్లు నమ్ముతున్నట్టు బలమైన కారణం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా లభించదు. విషయానికి వస్తే, 1983లో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో భారత జట్టు కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.

Pages