S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

11/04/2017 - 19:10

చెస్‌లో అత్యంత సుదీర్ఘమైన గేమ్ 1989లో జరిగింది. బెల్‌గ్రేడ్‌లో నికొలిక్, ఆర్సొవిక్ మధ్య జరిగిన ఆ పోటీ 269 ఎత్తుల వరకూ కొనసాగి, చివరికి డ్రాగా ముగిసింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ చెస్ చరిత్రలో ఇదే అతి సుదీర్ఘమైన గేమ్. కాగా, ఒక గేమ్‌ను 5,949 ఎత్తుల వరకూ కొనసాగించవచ్చని నిపుణులు అంటున్నారు. అన్ని ఎత్తులు ఆడాలంటే, ఎన్ని రోజులు లేదా నెలలు చెస్ బోర్డు ముందు కూర్చోవాలో?

11/04/2017 - 19:06

చాలామంది చెస్ ఆటగాళ్లు ఇప్పుడు కంప్యూటర్ల సాయం తీసుకుంటున్నారు. ముందుగా కొన్ని వేలు, లక్షల ఎత్తులను ఫీడ్ చేసి ఉంచడంతో, ప్రత్యర్థుల ఎత్తుగడులను ఏ విధంగా తప్పికొట్టాలనే విషయంపై అవగాహన పెంచుకోవడానికి కంప్యూటర్‌లో గేమ్ ఆడడాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. మనిషికీ, యంత్రానికి మధ్య చెస్ పోటీలు కూడా జరిగాయి.

11/04/2017 - 19:04

అమెరికాలోని క్లేవ్‌లాండ్‌లో పోలీసులు హఠాత్తుగా చెస్ టోర్నమెంట్ జరుగుతున్న హాలుపై దాడి చేశారు. ప్రైజ్‌మనీని బెట్టింగ్‌గానూ, చెస్ బోర్డు, పావులను పందాలు కాసేందుకు ఉపయోగించే పరికరాలుగానూ అభివర్ణిస్తూ, నిర్వాహకులపై కేసు పెట్టారు. ఈ సంఘటన కొన్ని శతాబ్దాల క్రితం జరిగిందికాదు. 1973లో ఫిడే ఆధ్వర్యంలో అధికారికంగా చెస్ గేమ్‌లు జరుగుతున్న రోజుల్లోనే చోటుచేసుకోవడం విచిత్రం.

10/28/2017 - 19:03

ఆసియా కప్ టైటిల్ భారత హాకీకి కొత్త ఊపిరి పోసింది. చాలా కాలం తర్వాత, అంతర్జాతీయ మేటి జట్లకు గట్టిపోటీనిచ్చే సత్తా ఉందని భారత్ నిరూపించుకోగలిగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్స్‌లో మరోసారి ఓడించినప్పుడు క్రీడాభిమానుల దృష్టిలో భారత్ విజయం సాధించింది. టైటిల్ అందుకోవడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది.

10/28/2017 - 19:00

అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌ను సమర్థంగా నిర్వహిస్తున్న భారత్ భవిష్యత్తులో అండర్-20 వరల్డ్ కప్ పోటీలు నిర్వహించే అవకాశం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం చిలీలో అండర్-17 వరల్డ్ కప్ జరిగినప్పుడు సుమారు నాలుగు లక్ష్లల మంది ఆ టోర్నమెంట్‌ను వీక్షించారు.

10/28/2017 - 18:57

న కెరీర్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేనని అయితే, తన కుమారుడితో కలిసి మ్యాచ్‌లు ఆడాలని ఉందని బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాయ్ జేమ్స్ వ్యాఖ్యానించాడు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను తన ఇష్టాయిష్టాలను బహిర్గతం చేశాడు. సాధ్యమైనంత ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగిస్తానని 32 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ అన్నాడు.

10/28/2017 - 18:55

అండర్-17 సాకర్ వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత ఫుట్‌బాల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పొరపాటు చేశారో లేక ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారో తెలియదుగానీ వారి నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్‌కు వివిధ స్థాయిల్లో ఆడిన జట్లకు గతంలో నాయకత్వం వహించిన వారిని అండర్-17 సాకర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించారు.

10/28/2017 - 18:53

ఆస్ట్రేలియాకు చెందిన మాజీ అంపైర్ డారెల్ హేర్ దొంగతనం చేసి దొరికిపోయాడు. తాను పొరపాటు చేశానని, దీనిని మొదటి తప్పుగా భావించి క్షమించాలని కోర్టును కోరాడు. 1995 సీజన్‌లో శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపించడంతోపాటు, పదేపదే నోబాల్స్ ప్రకటించి వివాదానికి కారణమైన హేర్ 1992-2008 మధ్యకాలంలో 78 టెస్టుల్లో అంపైర్‌గా వ్యవహరించాడు.

10/28/2017 - 18:51

కొలంబియా యువ ఫుట్‌బాలర్ డావిన్సన్ సాంచేజ్ డిఫెండర్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ట్రైనింగ్‌కు వెళ్లేందుకు రోజూ అతను సుమారు రెండు గంటలు ప్రయాణిస్తాడు. ఇంత దూరం వెళ్లడం వల్ల అలసట, చికాకు రాదా? అని విలేఖరులు ఒకసారి ప్రశ్నించినప్పుడు, ‘నా ఉద్యోగమే రక్షించడం. ప్రత్యర్థులుగానీ, వారు కొట్టిన బంతులుగానీ దూసుకురాకుండా ఎంతో ఓపిగ్గా ఎదురుచూడాలి.

10/28/2017 - 18:49

లోకేష్ రాహుల్‌కు మిడిల్ ఆర్డర్ కంటే ఓపెనింగ్ స్లాటే అచ్చొచ్చింది. 2014లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి విఫలమయ్యాడు. 2015లో ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించి, ఈ స్థానంలో తన తొలి ప్రయత్నంలోనే సెంచరీ నమోదు చేశాడు.

Pages