S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

10/28/2017 - 18:48

కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతూ వేసిన మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ను నమోదు చేసిన ఏకైక బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. 2005 కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో అతను అరంగేట్రం చేశాడు. మొదటి ఓవర్ బౌల్ చేస్తూ, 4, 5, 6 బంతుల్లో వరుసగా సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్ వికెట్లు పడగొట్టి, హ్యాట్రిక్ సాధించాడు. ఒక బౌలర్‌కు ఇంతకంటే గొప్ప ఏముంటుంది?

10/21/2017 - 19:15

ప్రపంచ మహిళా టెన్నిస్ సంఘం (డబ్ల్యుటిఎ) ఏటా అత్యుత్తమ క్రీడాకారిణి ఎవరని నిర్ధారించుకోవడానికి నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఈసారి ఆదివారం నుంచి మొదలుకానుంది. డబ్ల్యుటిఎ ఫైనల్స్‌గా ప్రఖ్యాతిగాంచిన ఈ టోర్నమెంట్‌లో మేటి క్రీడాకారిణులు ఆధిపత్య పోరాటాన్ని కొనసాగిస్తారు. సీజన్ చివరిలో జరుగుతుంది కాబట్టి, ఇది ఒక రకంగా వారికి ఆఖరి యుద్ధం.

10/21/2017 - 19:13

భారత స్పీడ్ స్టార్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ రోజురోజుకూ రాటుదేలుతున్నది. పదునెక్కుతున్న అతని బంతులను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వనే్డలో రాణించిన తీరే అతని ప్రతిభకు నిదర్శనం.

10/21/2017 - 19:12

భారత ఆర్చరీ సంఘం (ఎఎఐ) కోచ్ సునీల్ కుమార్‌పై వేటుపడింది. ఇటీవల అర్జెంటీనాలో యూత్ వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ జరిగినప్పుడు బ్రిటన్‌కు చెందిన ఒక మహిళా ఆర్చర్‌ను కౌగలించుకున్నాడు. ఈ పోటీల్లో భారత్ మూడు స్వర్ణాలను సాధించింది. అయితే, బ్రిటన్ ఆర్చర్‌ను హత్తుకోవడం వివాదం సృష్టించగా, సునీల్ కుమార్‌ను అక్కడి నుంచి స్వదేశానికి పంపేశారు.

10/21/2017 - 19:09

అస్ట్రేలియా యువ టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రేగ్‌లో జరిగిన లావెర్ కప్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఆరంభానికి ముందు అతను మోకాళ్లపై కూర్చోవడం వివాదానికి కారణమైంది. అంతకుముందు అమెరికా రగ్బీ క్రీడాకారులు అదే తరహాలో నిరసన వ్యక్తం చేయడంతో, వారికి మద్దతుగా కిర్గియోస్ ఆ విధంగా చేశాడని సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

10/21/2017 - 19:07

భారత జట్టు మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా ఇప్పటికే గుర్తింపు సంపాదించాడు. అయితే, సమయం దొరికిన ప్రతిసారీ తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌లోనూ అతను తన ప్రతిభాపాటవాలను కనబరుస్తూనే ఉన్నాడు.

10/21/2017 - 19:05

ఎవరైనా ఆటగాడు బ్యాటింగ్‌లో రాణిస్తాడు లేదా బౌలింగ్‌లో చెలరేగుతాడు. డెరెక్ రాండల్, గస్ లోగీ, ఏక్‌నాథ్ సోల్కర్, జాంటీ రోడ్స్ వంటి వారు తమ అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యంతో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రతిభ కనబరచే ఆటగాళ్లను ఆల్‌రౌండర్లుగా పేర్కొంటాం. కానీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వెలిగిపోయిన వారు చాలా అరుదు.

10/21/2017 - 19:03

కొంత మంది టెస్టు క్రికెటర్లుగా ముద్ర పడతారు. మరికొందరు పరిమిత ఓవర్ల ఫార్మాట్లకే పరిమితమవుతుంది. అటు టెస్టు, ఇటు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరచడం అరుదు. అందులోనూ పరస్పర విరుద్ధమైన టెస్టులు, వనే్డల్లో సమానంగా నెగ్గుకురావడం ఓపెనర్‌కు దాదాపు అసాధ్యం. కానీ, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్‌ను ఇందుకు మినహాయించాలి. టెస్టుగానీ.. వనే్డగానీ.. అతను ఓకే విధంగా ఆడతాడు.

10/21/2017 - 18:58

వనే్డ క్రికెట్‌లో ఎక్కువసార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మన్ రికార్డు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదే. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాగ్, శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చామిందా వాస్ 72 ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా ఉండగా, ఆ రికార్డును ధోనీ అధిగమించాడు. వికెట్‌ను కోల్పోకుండా ఇన్ని వనే్డలు ఆడడం అసాధ్యమని చెప్పలేకపోయినా, సులభం మాత్రం కాదు.

10/14/2017 - 19:10

చాలాకాలంగా వాయదాపడుతూ వస్తున్న బిసిసిఐ ప్రక్షాళన అంశం చివరి మజిలీకి చేరింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో తలెత్తుతున్న అవరోధాలను అధిగమించడానికి నిబంధనావళిని సవరించడం ఒక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చింది.
తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా బిసిసిఐ అధికారులను అదేశించిన కోర్టు

Pages