S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

10/07/2017 - 19:48

కోచ్‌లు కూడా మనుషులే. వారికీ కోపతాపాలుంటాయి. కానీ, ఒక స్టార్ క్రికెటర్ కాలర్ పట్టుకునే సాహసం ఎవరూ చేయరనే అనుకుంటాం. అయితే, జాన్ రైట్‌ను మాత్రం దీనినుంచి మినహాయించాలి. 2002లో ఇంగ్లాండ్‌లో జరిగిన నాట్‌వెల్త్ ట్రోఫీ మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా షాట్ కొట్టి వీరేందర్ సెవాగ్ అవుట్ కావడంతో రైట్ కోపం కట్టడి తెంచుకుంది. సెవాగ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన వెంటనే అతను కాలర్ పట్టుకొని ఇదేం పని అంటూ నిలదీశాడు.

10/07/2017 - 19:46

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)లో ముసలం పుట్టింది. స్కాట్‌లాండ్‌తో కలిసి ఇటీవలే టెస్టు హోదా సంపాదించామన్న ఆనందం కూడా ఎవరికీ దక్కనీయకుండా ఎసిబిలో అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నది. అఫ్గాన్ జాతీయ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తన పదవికి రాజీనామా ఇవ్వడం వెనుక ఎసిబి అధికారుల హస్తం ఉందన్నది వాస్తవం.

10/07/2017 - 19:43

భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నూపుర్ నాగర్‌తో అతని నిశ్చితార్థం జరిగింది. దీనితో సినీ నటి అనుస్మృతి సర్కార్‌తో అతనికి అఫైర్ ఉందన్న ఊహాగానాలకు తెరపడింది.

10/07/2017 - 19:38

ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ మధ్య ఇటీవల శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాల నడుమ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనో, పరస్పరం దాడులకు ఉపక్రమించే ప్రమాదం పొంచి ఉందనో ఈ చర్చలు జరిగాయనుకుంటే పొరపాటే. ఇంతకీ ఇవి రాజకీయ చర్చలుకావు. చిరకాల ప్రత్యర్థులపై ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ మధ్య ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మ్యాచ్‌లు జరిగే సమయాల్లో అభిమానుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా, ముందు జాగ్రత్తచర్యగా చేపట్టిన చర్యలివి.

10/07/2017 - 19:38

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి లండన్‌లో భయంకరమైన అనుభవం ఎదురైంది. నవ్‌జోత్ సింగ్ సిద్ధుతో కలిసి ట్రైన్‌లో వెళుతున్నప్పుడు, కూపేలో కొంతమంది యువకులు బీరు తాగుతున్నారు. గంగూలీ, సిద్ధు వారిని చూడనట్టే నటించారు. కానీ, తాగిన మైకంలో ఉన్న ఓ యువకుడు బీర్ క్యాన్‌ను గంగూలీకి గురి చూసి విసిరాడు. అప్పటివరకూ ఓపిక పట్టిన సిద్ధు ఒక్కసారిగా ఆ యువకుడిపై లంఘించాడు. దీనితో గంగూలీ కూడా రంగంలోకి దిగక తప్పలేదు.

10/07/2017 - 19:35

మాజీ బ్యాట్స్‌మన్ షర్జీల్ ఖాన్‌పై ఐదేళ్ల నిషేధాన్ని విధించడం పాక్ క్రికెట్‌లో చర్చకు కారణమైంది. ఈ అంశంపై అటు షర్జీల్, ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు షర్జీల్ ఖాన్‌పై ఆరోపణలున్నాయి.

09/23/2017 - 18:15

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు అనుకోని లాభం వచ్చింది. 11వ ఐపిఎల్‌కు ఇంకా సన్నాహాలు మొదలుపెట్టక ముందే, ఒక్కో ఫ్రాంచైజీకి ఉమారు 150 కోట్ల రూపాయలు దక్కడం విశేషం.

09/23/2017 - 18:12

* జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియాన్ని నిర్మించిన తొలిరోజులు. 1987లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కి ఆ స్టేడియం వేదికైంది. అక్కడ అదే తొలి టెస్టు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ ఓపెనర్ సునిల్ గవాస్కర్ గార్డ్ తీసుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ వేసిన తొలి బంతి అతని బ్యాట్‌ను తలుగుతూ వెళ్లింది. జావేద్ మియందాద్ చక్కటి క్యాచ్ పట్టాడు. గవాస్కర్ పెవిలియన్ చేరాడు.

09/23/2017 - 18:10

* బిషన్ సింగ్ బేడీ, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్‌లను ‘స్పిన్నర్లత్రయం’ అని పేర్కొనేవారు. ప్రపంచ మేటి బౌలర్లుగా వీరికి పేరుంది. ప్రసన్న, చంద్రశేఖర్ చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ చూపేవారు. అసాధారణ ప్రతిభ చూపి బౌలర్లుగా ఎదిగారు. అయితే, బేడీ మాత్రం చిన్నతనంలో క్రికెటర్‌ను కావాలని అనుకోలేదు. బాగా లావుగా ఉండడంతో బరువు తగ్గడానికి బేడీ తండ్రి అతనిని క్రికెట్ అకాడెమీలో చేర్చారు.

09/23/2017 - 18:06

* ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌కు ఒక అలవాటు సమస్యలు తెచ్చిపెడుతున్నది. క్రికెట్ ప్రపంచంలో సమర్థుడైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న అతను తీరిక దొరికినప్పుడల్లా గోల్ఫ్ ఆడేవాడు. ఖాళీగా ఉంటే, గోల్ఫ్ బంతిని స్టిక్‌తో కొడుతున్నట్టు ఊహిస్తూ, పొజిషన్ తీసుకునేవాడు. గాల్లోనే చేతులు ఊపేవాడు. ఈ అలవాటు కారణంగానే గెనీవాలో విమానాశ్రయ అధికారుల దృష్టిలో పడ్డాడు.

Pages