S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/13/2018 - 18:24

బంతిని మెరిపించడానికి బౌలర్లు నానా తంటాలు పడుతుంటారు. లాలాజలాన్ని పూస్తూ, ప్యాంటుకు రుద్దుతూ షైనింగ్‌ను పెంచే ప్రయత్నం చేస్తారు. అంతేగానీ, బంతిని ఎవరూ ముద్దుపెట్టుకోరు. కానీ, శ్రీలంక పేసర్ మలింగ స్టయిలే వేరు. అతని బౌలింగ్ యాక్షన్ ఎంత భిన్నంగా ఉంటుందో, అంతే చిత్రంగా బంతి వేయడానికి రనప్ మొదలుపెట్టడానికి ముందు దానిని ముద్దాడతాడు. బంతిని ముద్దు పెట్టుకునే బౌలర్ అతనొక్కడేనేమో!

01/13/2018 - 18:22

జిమ్ లేకర్ తర్వాత టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే. 1999 ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో అతను ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఒక బౌలర్ బంతులు వేయడానికి ఉపక్రమించే సమయంలో టోపీ, గాగుల్స్ లేదా స్వెటర్‌ను అంపైర్‌కు ఇవ్వడం పరిపాటి.

01/13/2018 - 18:20

డబ్బు ముందు ఏవీ పని చేయవు. అమెరికా జాతీయ ఫుట్‌బాల్ (రగ్బీ) లీగ్ మ్యాచ్‌లను అభిమానులు విరగబడి చూస్తారు కాబట్టి, దాదాపు ఏడాది పొడవునా మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. అయితే, న్యూయార్క్‌లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో, బఫెలో బిల్స్, ఇండియానా పొలిస్ కోల్ట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడుతుందని అంతా ఊహించారు.

01/13/2018 - 18:19

సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా వంటి మేటి బ్యాట్స్‌మెన్‌తో పోల్చగల ప్రతిభావంతుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. అతను గొప్ప బౌలరేమీ కాడు. 378 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడితే, కేవలం 58 బంతులు మాత్రమే వేశాడు. 64 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, బౌలింగ్‌లో ఎవరూ ఇంతవరకూ సాధించలేకపోయిన అరుదైన రికార్డును సొంతం చేసుకొని, సూపర్ బౌలర్ అనిపించుకున్నాడు.

01/13/2018 - 18:10

గొడ్డలిని ఎందుకు ఉపయోగిస్తారు? కట్టెలు కొట్టడానికి అంటూ ఎవరైనా ఈ ప్రశ్నకు సులభంగా సమాధానమిస్తారు. కానీ, కెనడాలోని నోవా స్కాటియా ప్రాంతానికి వెళితే, ఆర్చరీ మాదిరి కొత్త ఆట ఆడేందుకని జవాబు చెప్తారు. హాలీఫాక్స్‌లోని ఒక కట్టెల దుకాణాన్ని నడుపుతున్న డారెన్ హడ్సన్‌కు వచ్చిన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కొత్త క్రీడా ‘యాక్స్ త్రోయింగ్’.

01/13/2018 - 18:07

కుక్కలు విశ్వాసానికి మారుపేరని మరోసారి రుజువు చేసిన సంఘటన ఇది. 2014లో స్వీడన్‌కు చెందిన నలుగురు సభ్యులతో కూడిన ట్రెక్కింగ్ బృందం అడ్వెంచర్ రేసింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. పోటీ ఆరంభమైన కొద్దిసేపటి తర్వాత, సేద తీరేందుకు ఒకచోట కూర్చున్నప్పుడు వీధి కుక్క ఒకటి ఆకలితో తమవైపే చూడడాన్ని ట్రెకర్లు గమనించారు. జాలిపడి, రొట్టె ముక్కలను దానికి వేశారు.

01/13/2018 - 18:04

బ్రిటన్‌లో విపరీతంగా మంచు కురుస్తున్న కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దుకాగా, ఇదే మంచి సమయమనుకున్న చాలా మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వెస్ట్ హామ్ స్ట్రయికర్ ఆండీ కరోల్ తన కుమారుడు ఆర్లోస్‌తో కలిసి మంచు తినె్నల్లో విహారం చేస్తున్నాడు. కొడుకు కోసం మంచు మనిషి బొమ్మను సిద్ధం చేసి మురిసిపోయాడు. ఎప్పుడూ బిజీగా ఉండే సాకర్ ఆటగాళ్లకు ఈ మాత్రం ఆటవిడుపు ఉండాలి కదా!

01/13/2018 - 17:59

మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ ఆటగాళ్ల మధ్య మైదానంలో మొదలైన ఘర్షణ ఆ తర్వాత కూడా కొనసాగింది. మాంచెస్టర్‌లోని డెర్బీ టనె్నల్‌లో పరస్పరం ఎదురైన ఇరు జట్ల ఆటగాళ్లు, అధికారులు, సపోర్టింగ్ స్ట్ఫా బాహాబాహీకి దిగారు. యునైటెడ్ ఆటగాళ్ల దాడిలో సిటీ ఆటగాడు జొస్ వౌరిన్హో తలకు బలమైన గాయమైంది. ఆ జట్టు కోచ్ మకెల్ అర్టెటా కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

01/06/2018 - 19:11

రష్యాలో ఈ ఏడాది జూన్ 14 నుంచి జూలై 15వ తేదీ వరకూ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్న నేపథ్యంలో, ఈ హక్కులను దక్కించుకోవడానికి వివిధ దేశాలు అడ్డదారులు తొక్కడం, భారీగా ముడుపులు చెల్లించడం తదితర సంఘటనలపై చర్చ జోరుగా సాగుతున్నది. అదే సమయంలో అమెరికా నిఘా విభాగం జరుపుతున్న విచారణలో అనేకానేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయ.

01/06/2018 - 19:09

వింటర్ ఒలింపిక్స్ కోసం ఏటా ఫిబ్రవరి మాసంలో జరగాల్సిన సైనిక విన్యాసాలను వాయిదా వేసుకోవాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. చాలాకాలంగా అమెరికాతో కలిసి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో సంయుక్త మిలటరీ రొటీన్‌ను నిర్వహించడం దక్షిణ కొరియాకు ఆనవాయితీగా వస్తున్నది.

Pages