S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/22/2017 - 23:44

* ఐపిఎల్‌ను చాలామంది గాయాల టోర్నీగా పేర్కొంటారు. ఇందులో పాల్గొనే ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోవడం మామూలే. ప్రతి మ్యాచ్‌లోనూ గొప్పగా ఆడడం ద్వారా వచ్చే ఐపిఎల్‌లో డిమాండ్ తగ్గకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే గాయపడుతుంటారు. ఎంతో మంది ఆటగాళ్లు గాయాలను బయటపెట్టకుండా డబ్బు కోసం టోర్నీలో ఆడిన సంఘటనలు లేకపోలేదు.

04/15/2017 - 21:53

అయనవారిని ఒక రకంగా, కాని వారిని మరో రకంగా చూడడం క్రికెట్ పెద్దలకు అలవాటుగా మారింది. సాధారణ ఆటగాళ్లకు వర్తించే నిబంధనలేవీ స్టార్ క్రికెటర్లకు పట్టవు. క్రమశిక్షణకు కట్టుబడి లేకపోయనా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా వారిని నియంత్రీకరించే పనికి అధికారులు పూనుకోవడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లోనేకాదు..

04/15/2017 - 21:50

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లకూ, క్రమశిక్షణకూ ఆమడ దూరమన్న విమర్శలకు సొహైల్ ఖాన్ ఉదంతం బలాన్నిస్తున్నది. మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రం, వకార్ యూనిస్ తదితరులు క్రికెట్ మైదానంలోగాక, ఆతర్వాత ఇప్పటికీ వివాదాస్పద వైఖరితో పాక్ క్రికెట్ ప్రతిష్ఠను బజారుకీడుస్తునే ఉన్నారు. మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఆసిఫ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నారు.

04/15/2017 - 21:48

ఒలింపిక్స్ మారథాన్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి కెన్యా మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన జెమీమా సంగాంగ్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీనితో, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె సాధించిన స్వర్ణ పతకాన్ని రద్దు చేయాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) తీర్మానించినట్టు బ్రిటిష్ మీడియా ప్రకటించింది. అయితే, ఈ విషయాన్ని సమాఖ్య ఇంకా ధ్రువీకరించలేదు.

04/15/2017 - 21:47

ప్రపంచంలో అత్యధిక శాతం మందికి ఫిషింగ్ ఓ ఆట. మత్స్యకారులను మినహాయిస్తే, చాలా మంది ఔత్సాహికులు గాలాలు పట్టుకొని చెరువులు, కుంటలు, వాగులు, నదుల్లో చేపలు పట్టి ఆనందిస్తుంటారు. ఈ విధంగా సంప్రదాయ పద్ధతుల్లో చేపల వేటకు ససేమిరా అంటున్న కొంతమంది కొండ చెరియల నుంచి సుమారు 400 అడుగుల కిందకు దిగి చేపలు పడుతున్నారు. తూర్పు యార్క్‌షైర్ (బ్రిటన్)లోని బ్రిడ్లిటన్‌లో ఈ తంతు కొనసాగుతున్నది.

04/15/2017 - 21:46

ఒక క్లబ్ స్థాయి మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జెర్సీలను ధరించి వచ్చిన కాశ్మీరీ క్రికెటర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా, పాక్ జెర్సీలు ధరించిన క్రికెటర్లను పోలీసులు అరెస్టు చేశారు.

04/15/2017 - 21:43

క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు నార్వేకు చెందిన కోచ్ జొర్నర్ హాకెన్స్‌మన్. 2006 వింటర్ ఒలింపిక్స్‌లో నార్వే క్రాస్ కంట్రీ స్కీయింగ్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించాడు. ఆసమయంలో కెనడాకు చెందిన ఒక స్కీయర్ అవసరాన్ని గుర్తించి, ఆమెకు స్కీ పోల్‌ను ఇచ్చాడు. దానిని తీసుకొని రేస్‌లో పాల్గొన్న ఆ స్కీయర్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కెనడా అభిమానులంతా జొర్నర్ క్రీడాస్ఫూర్తిని కొనియాడారారు.

04/15/2017 - 21:41

ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ ఏడాది పాటు దేశవాళీ వనే్డ టోర్నీల నుంచి సస్పెండ్ అయ్యాడు. ఇటీవల క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఒకీఫ్ పీకలదాకా తాగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులతోపాటు, సహచరులు, మాజీ క్రికెటర్లపైనా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు. అతని పిచ్చివాగుడును సిఎ తీవ్రంగా పరిగణించింది.

04/08/2017 - 22:16

ఆర్భాటపు ప్రకటనలు.. పర్యటనల హంగామాలు లేవు.. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు శిల్పిలో కనిపించే ఏకాగ్రతతో బిసిసిఐ పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పని చేస్తున్నది. మూడో కంటికి తెలియకుండా, తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నది. సిఒఎను తక్కువ అంచనా వేసిన బోర్డు, దాని సభ్య సంఘాల అధికారులు క్రమంగా దారిలోకి వస్తున్నారు. లోధా సిఫార్సుల అమలుకు బలమైన పునాది పడుతున్నది.

04/08/2017 - 22:12

సుప్రీం కోర్టు నియమించిన సిఒఎ ముందు పలు సవాళ్లు ఉన్నాయన్నది వాస్తవం. లోధా కమిటీ ప్రతిపాదనలను సంపూర్ణంగా అమలు చేయడం అసాధ్యమని కోర్టుకు బిసిసిఐ వివిధ సందర్భాల్లో స్పష్టం చేసింది. అంతేగాక, ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Pages