S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/02/2017 - 03:33

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఈ సిరీస్‌లో మూడు శతకాలతో రాణించాడు. మొత్తం మీద ఆరు సెంచరీలు నమోదుకాగా, వాటిలో మూడు స్మిత్‌వే కావడం గమనార్హం. చటేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా, గ్ల్లెన్ మాక్స్‌వెల్ తలా ఒక వికెట్ కూల్చారు. కాగా, అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గానూ స్మిత్ అగ్రస్థానంలో నిలిచాడు. అతను మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌లో 499 పరుగులు చేశాడు. ఈ స్కోరులో 52 ఫోర్లు ఉన్నాయి.

04/02/2017 - 03:32

ఎప్పుడూ అంతర్యుద్ధం, బాంబు మోతలతో మారుమోగే అఫ్గానిస్థాన్‌లో క్రీడాకారులుగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ‘బుకాషి’ వంటి సాంప్రదాయ ఆటలకు తప్ప అఫ్గాన్‌లో మిగతా వాటికి ప్రాధాన్యం లేదు. క్రికెట్‌ను ఇస్లామిక్ మత విశ్వాసాలకు విరుద్ధంగా అక్కడ అభివర్ణిస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన మహమ్మద్ షాజాద్ దూకుడును కొనసాగిస్తున్నాడు.

04/02/2017 - 03:31

ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి పోటీదారులు తగ్గుతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి మల్లగుల్లాలు పడుతున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)పై పారిస్ బాంబు పేల్చింది. 2024 ఒలింపిక్స్ హక్కుల కోసం బిడ్ వేశామని, ఒకవేళ దానిని కాదని, 2028 ఒలింపిక్స్‌ను ఇస్తామంటే ఎంతమాత్రం ఒప్పుకోబోమని తెగేసి చెప్పింది.

03/25/2017 - 23:02

ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విందు మరోసారి అభిమానులను ఊరిస్తున్నది. ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిగే ఈ ‘పొట్టి క్రికెట్’ను నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనాధికారుల కమిటీ సిద్ధమైంది.

03/25/2017 - 22:59

* ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మను ఉదారుడిగా పేర్కోవాలి. సన్‌రైజర్స్ హైదాబాద్ తరఫున 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లు బౌల్ చేసి 66 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు. అదే ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు ఉమేష్ యాదవ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు ఓవర్లు వేసి, వికెట్ సాధించకుండా 65 పరుగులు సమర్పించుకున్నాడు.

03/25/2017 - 22:57

* ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కొంత మంది బౌలర్లు కూడా ఈ టోర్నీపై తమదైన ముద్ర వేశారు. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ (ముంబయి ఇండియన్స్) 98 ఇన్నింగ్స్‌లో 143 వికెట్లు పడగొట్టి, మేటి బౌలర్ల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచాడు. అమిత్ మిశ్రా 112 ఇన్నింగ్స్‌లో 124, డ్వేయిన్ బ్రేవో 103 ఇన్నింగ్స్‌లో 122 చొప్పున వికెట్లు కూల్చారు.

03/25/2017 - 22:55

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ 2013లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఐపిఎల్‌లో రికార్డుగా నమోదైంది. పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 66 బంతుల్లోనే అజేయంగా 175 పరుగులు సాధించాడు.

03/19/2017 - 06:45

భయపడుతున్న పోటీదారులు బిడ్స్‌కు దక్కని ప్రజాదరణ

03/19/2017 - 06:42

భారత జట్టుకు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యల్ప స్కోరు 54 పరుగులు. 2000 అక్టోబర్ 29న శ్రీలంకతో జరిగిన షార్జా కప్ ఫైనల్‌లో టీమిండియా కుప్పకూలిన వైనమిది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు సాధించింది. సనత్ జయసూర్య 161 బంతుల్లో, 21 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 189 పరుగులు సాధించాడు. రసెల్ ఆర్నాల్డ్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

03/19/2017 - 06:41

ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, అసలు బంతిని ఆడకుండానే డకౌట్ కావడం చాలా అరుదు. దీనిని ‘డైమండ్ డక్’ అంటారు. క్రికెట్ చరిత్రలో తొలి ‘డైమండ్ డక్’ కెనడా ఆటగాడు హెన్రీ ఒసినే్డ పేరుమీద ఉంది. అలెక్స్ కూసక్ వేసిన వైడ్ బంతిని ఆడేందుకు క్రీజ్ నుంచి ముందుకు దూకుకెళ్లిన అతను షాట్ కొట్టలేక, వికెట్ కీపర్ స్టంప్ చేయడంతో అవుటయ్యాడు.

Pages